- Telugu News Photo Gallery Indian Test Team Players Started Net Practicing ahead of IND vs BAN 2nd test on Dec 22
IND vs BAN 2nd test: రేపు జరగబోయే రెండో టెస్ట్ కోసం నెట్ ప్రాక్టీస్ ప్రారంభించిన టీమిండియా.. తుది జట్టు వివరాలివే..
భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ రెండో టెస్టు: రెండో టెస్టు కోసం టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ ప్రారంభించారు. విరాట్ కోహ్లీ, కేఎస్ భరత్ నెట్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు. మైదానంలో బౌలర్లు కూడా చెమటలు పట్టిస్తున్నారు. ఇక దానికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Updated on: Dec 21, 2022 | 6:45 AM

చటోగ్రామ్‌లోని జహూర్ అహ్మద్ చౌదరి స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో 188 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన భారత జట్టు ఇప్పుడు రెండో టెస్టుకు సిద్ధమైంది. రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉన్న టీమిండియా సిరీస్ కైవసం చేసుకోవాలంటే రెండో టెస్టు మ్యాచ్‌లో తప్పక గెలవాలి.

భారత్, బంగ్లాదేశ్ మధ్య డిసెంబర్ 22 నుంచి డిసెంబర్ 26 వరకు జరిగే రెండో టెస్టు మ్యాచ్ ఢాకాలోని షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం గురువారం(డిసెంబర్ 22) ఉదయం 9 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. దానికి అరగంట ముందు అంటే 8 గంటల 30 నిముషాలకు టాస్ వేస్తారు.

ఇక రెండో టెస్టుకు కేవలం ఒక్క రోజే మిగిలి ఉండడంతో టీమిండియా ఆటగాళ్లు నెట్ ప్రాక్టీస్ ప్రారంభించారు. విరాట్ కోహ్లీ, కేఎస్ భరత్ నెట్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు. మైదానంలో బౌలర్లు కూడా చెమటలు పట్టిస్తున్నారు.

బంగ్లాదేశ్ పర్యటనలో రెండో వన్డే మ్యాచ్‌లో గాయపడిన భారత రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ దాని నుంచి పూర్తిగా కోలుకోలేదు. ఆ కారణంగనే తొలి టెస్టుకు దూరమైన రోహిత్ ఇప్పుడు రెండో టెస్టుకు కూడా అందుబాటులో ఉండడు.

రెండో టెస్టుకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. గాయం కారణంగా తొలి టెస్టుకు అందుబాటులో లేని ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ రెండో టెస్టుకు కూడా దూరమయ్యాడు. అంతే కాక పేసర్ హుస్సేన్ కూడా గాయంతో ఢాకా టెస్టుకు దూరమయ్యాడు.

టీమ్ ఇండియా: కేఎల్ రాహుల్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), కేఎస్ భరత్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, అభిమన్యు యాదవ్ ఈశ్వరన్, నవదీప్ సైనీ, సౌరభ్ కుమార్, జయదేవ్ ఉనద్కత్.

బంగ్లాదేశ్ జట్టు: జకీర్ హసన్, నజ్ముల్ హొస్సేన్ శాంటో, లిటెన్ దాస్, షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), ముష్ఫికర్ రహీమ్, యాసిర్ అలీ, నూరుల్ హసన్ (వికెట్ కీపర్), మెహిదీ హసన్ మిరాజ్, తైజుల్ ఇస్లాం, ఖలీద్ అహ్మద్, నసుమ్ అహ్మద్, మహ్మదుల్ హసన్, పి. మోమినుల్ హక్, రెహ్మాన్ రాజా, తస్కిన్ అహ్మద్.





























