AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Crime: అమ్మ తనానికి కలంకం! ప్రియుడితో కలిసి కన్న కూతురిని హత్య చేసిన తల్లి..

ప్రియుడి మోజులో పడి కన్న బిడ్డను హత్య చేసింది ఓ కసాయి తల్లి. ఈ దారుణమైన ఘటన నల్లొండ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు ప్రకారం..

Telangana Crime: అమ్మ తనానికి కలంకం! ప్రియుడితో కలిసి కన్న కూతురిని హత్య చేసిన తల్లి..
Telangana Crime News
Srilakshmi C
|

Updated on: Dec 20, 2022 | 11:50 AM

Share

ప్రియుడి మోజులో పడి కన్న బిడ్డను హత్య చేసింది ఓ కసాయి తల్లి. ఈ దారుణమైన ఘటన నల్లొండ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు ప్రకారం.. నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఎలికట్టే గ్రామానికి చెందిన ఉయ్యాల వెంకన్నకు లచ్చుగూడేనికి చెందిన రమ్యతో 2015లో వివాహం జరిగింది. వీరికి కుమారుడు శివరాం (5), కుమార్తె ప్రియాన్షిక (2) సంతానం. వెంకన్న కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించే వాడు. ఈ ఏడాది (2022) కరోనా కారణంగా భర్త వెంకన్న మృతి చెందడంతో రమ్య, తన ఇద్దరు పిల్లలతో అత్త మామలతో కలిసి ఉండేది. ఐతే గతకొంతకాలం క్రితం అదే గ్రామానికి చెందిన పెరిక వెంకటేశ్వర్లు అనే వ్యక్తితో రమ్యకు పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. అత్తారింట్లో తనకు ఇబ్బందిగా ఉంటుందని భావించి, అదే గ్రామంలో మరో ఇంటిని అద్దెకు తీసుకుని వెంకటేశ్వర్లుతో సహజీవనం చేస్తోంది. ఆమె కుమారుడు శివరాం స్థానిక పాఠశాలకు వెళ్తుండగా, రెండేళ్ల ప్రియాన్షికా తల్లి వద్దనే ఉండేది.

తమ వివాహేతర సంబంధానికి చిన్నారిని అడ్డుగా భావించారు రమ్య, వెంకటేశ్వర్లు. దీంతో చిన్నారిని హత్య చేసేందుకు పథకం పన్నారు. దీనిలో భాగంగా అత్తమామలు తన పిల్లలను చంపాలనుకుంటున్నట్లు ఈ వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేసింది. అదును చూసి డిసెంబర్‌ 14న రాత్రి సమయంలో రమ్య, ఆమె ప్రియుడు కలిసి చిన్నారిని గోడకేసి విసిరి కొట్టారు. అనంతరం ముక్కు, నోరు మూసి ఊపిరాడకుండా చేసి చంపేశారు. చిన్నారికి మూర్ఛ వచ్చిందని చెప్పి నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి అదే రోజు రాత్రి తీసుకెళ్లారు. చిన్నారిని పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు వెల్లడించారు. అనంతరం చిన్నారి మృతదేహాన్ని మార్చురీలో ఉంచి రమ్య, వెంకటేశ్వర్లు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆసుపత్రికి చేరుకున్న అత్తమామలు చిన్నారి శరీరంపై గాయాలను చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు రమ్య, వెంకటేశ్వర్లుపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. తమదైన శైలిలో విచారించగా నిందితులిద్దరూ నేరాన్ని అంగీకరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రై వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
మేక పిల్లల కోసం దారుణం.. మాజీ సర్పంచ్ దాడిలో పశువుల కాపరి బలి!
మేక పిల్లల కోసం దారుణం.. మాజీ సర్పంచ్ దాడిలో పశువుల కాపరి బలి!
చూసేందుకు కంటిలో నలుసంత.. కానీ దగ్గు, ఆస్తమాకు చెక్ పెట్టేస్తుంది
చూసేందుకు కంటిలో నలుసంత.. కానీ దగ్గు, ఆస్తమాకు చెక్ పెట్టేస్తుంది
గురు పూర్ణిమ నుంచి మహర్దశ.. ఇక ఈ రాశుల వారికి తిరుగుండదు!
గురు పూర్ణిమ నుంచి మహర్దశ.. ఇక ఈ రాశుల వారికి తిరుగుండదు!
పేపర్ లీక్‌లపై కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్..!
పేపర్ లీక్‌లపై కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్..!
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి
800 ఏళ్ల చరిత్ర.. హిందూ-ముస్లిం ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఆలయం..
800 ఏళ్ల చరిత్ర.. హిందూ-ముస్లిం ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఆలయం..
రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ఎన్ని గంటల వరకు చెల్లుబాటు అవుతుంది?
రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ఎన్ని గంటల వరకు చెల్లుబాటు అవుతుంది?