Winter Health Tips: శీతాకాలంలో గొంతునొప్పి, జలుబు నుంచి వేగంగా ఉపశమనం పొందాలంటే..
చలిగాలులు ప్రారంభమయ్యాయి. మంచు కూడా బాగానే కురుస్తోంది. ఈ కాలంలో ఎంత జాగ్రత్తగా ఉన్న జలుబు, జ్వరం, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలు వెంటాడుతాయి. సీజన్ మారినప్పుడు ఈ విధమైన..
చలిగాలులు ప్రారంభమయ్యాయి. మంచు కూడా బాగానే కురుస్తోంది. ఈ కాలంలో ఎంత జాగ్రత్తగా ఉన్న జలుబు, జ్వరం, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలు వెంటాడుతాయి. సీజన్ మారినప్పుడు ఈ విధమైన సమస్యలు తలెత్తడం కొత్తేమీకానప్పటికీ.. బ్యాక్టీరియా, వైరస్‌ల వ్యాప్తి ఈ కాలంలో ఎక్కువగా ఉంటుంది. ఐతే ఇంట్లో తయారు చేసుకునే ఈ పానియాల ద్వారా శీతాకాలంలో తలెత్తే ఆరోగ్య సమస్యల నుంచి తేలికగా ఉపశమనం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అవేంటంటే..
జలుబు, దగ్గు వంటి రుగ్మతలకు అల్లం దివ్యౌషధం అని చెప్పవచ్చు. ఇన్ఫెక్షన్ నుంచి రక్షణ కలిగించడంలో అల్లం పాత్ర కీలకమైనది. దీనిలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు అధికంగా ఉంటాయి. అల్లంతో తయారు చేసిన టీ, కషాయం వంటివి తాగడం వల్ల గొంతునొప్పి, జలుబు, దగ్గు సమస్యల నుంచి వేగంగా ఉపశమనం పొందవచ్చు. అలాగే దాల్చిన చెక్క, లవంగాలు, నిమ్మకాయతో తయారు చేసిన పానియం కూడా గొంతు సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. అంతేకాకుండా శరీరంలో రోగనిరోధకతను బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే తులసి ఆకులతో తయారు చేసిన టీ కూడా జలుబు, దగ్గు నుంచి ఉపశమనం కలిగిస్తుంది. దీనిలో యాంటీమైక్రోబయల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటిట్యూసివ్, యాంటీ అలెర్జిక్ లక్షణాలు అధికంగా ఉంటాయి. అలాగే కాచిన నీళ్లు తాగడం. పోషకాహారం తీసుకుంటే రోగాలను తరిమికొట్టే రక్షణ వ్యవస్థ బలం పుంజుకుంటుందని నిపుణులు అంటున్నారు.
మరిన్ని తాజా ఆరోగ్య సమాచారం కోసం క్లిక్ చేయండి.