Hyderabad: తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్‌ పరుగుపందెంలో విషాదం.. గుండెపోటుతో వ్యక్తి మృతి!

తెలంగాణ సర్కార్‌ చేపట్టిన పోలీస్‌ ఉద్యోగ నియామకాల కోసం ఫిజికల్‌ టెస్టులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా పోలీస్ రిక్రూట్‌మెంట్‌ కోసం నిర్వహించిన పరుగుపందెంలో విషాదం చోటు..

Hyderabad: తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్‌ పరుగుపందెంలో విషాదం.. గుండెపోటుతో వ్యక్తి మృతి!
Telangana Police Physical Tests
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 20, 2022 | 7:51 AM

తెలంగాణ సర్కార్‌ చేపట్టిన పోలీస్‌ ఉద్యోగ నియామకాల కోసం ఫిజికల్‌ టెస్టులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా పోలీస్ రిక్రూట్‌మెంట్‌ కోసం నిర్వహించిన పరుగుపందెంలో విషాదం చోటుచేసుకుంది. కాకతీయ యూనివర్సిటీలో డిసెంబర్‌ 17న నిర్వహించిన కానిస్టేబుల్ ఫిజికల్‌ టెస్ట్‌లో పాల్గొన్న రాజేందర్‌ అనే అభ్యర్ధి మృతి చెందాడు. ములుగు జిల్లా పందికుంట శివారు శివాతాండకు చెందిన రాజేందర్.. 1600 మీటర్ల పరుగులో పాల్గొన్నాడు. పరుగు మధ్యలోనే తీవ్ర స్వస్థతకు గురికావంతో రాజేందర్‌ కుప్పకూలిపోయాడు.

దీంతో సిబ్బంది హుటాహుటిన అతన్ని సమీపంలోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు రాజేందర్‌కు గుండెపోటు వచ్చినట్లు వెల్లడించారు. అదే ఆస్పత్రి వైద్యులు వెంటిలేటర్‌పై ఉంచి గత 4 రోజులుగా చికిత్స అందించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ రాజేందర్ ఈ రోజు మృతి చెందాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.