Russia-Ukraine War: ఉక్రెయిన్‌పై మళ్లీ విరుచుకుపడ్డ రష్యా.. ‘నాలుగు అమెరికా క్షిపణులను కూల్చివేశాం..’ రష్యా ప్రకటన

దక్షిణ రష్యా ప్రాంతంలోని ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో అమెరికా తయారు చేసిన 4 నాలుగు క్షిపణులను తమ వైమానిక రక్షణ వ్యవస్థ కూల్చివేసినట్లు రష్యా సోమవారం (డిసెంబర్‌ 19) ప్రకటించింది. ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తున్న..

Russia-Ukraine War: ఉక్రెయిన్‌పై మళ్లీ విరుచుకుపడ్డ రష్యా.. 'నాలుగు అమెరికా క్షిపణులను కూల్చివేశాం..' రష్యా ప్రకటన
Russia Shot Down 4 US Made Missiles
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 20, 2022 | 6:58 AM

దక్షిణ రష్యా ప్రాంతంలోని ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో అమెరికా తయారు చేసిన 4 నాలుగు క్షిపణులను తమ వైమానిక రక్షణ వ్యవస్థ కూల్చివేసినట్లు రష్యా సోమవారం (డిసెంబర్‌ 19) ప్రకటించింది. ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తున్న వరుస దాడుల్లో భాగంగా ఈ మేరకు కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది దాదాపు 10 నెలలుగా జరుగుతున్న యుద్ధంలో క్షిపణుల కూల్చివేత గురించి రష్యా ప్రకటించడం ఇదే తొలిసారి. బెల్గోరోడ్ ప్రాంతంపై గగనతలంలోకి దూసుకు వచ్చిన నాలుగు అమెరికన్ హార్మ్‌ (HARM) యాంటీ-రాడార్ క్షిపణులను కాల్చివేసినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ సోషల్ మీడియాలో ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. ఉక్రెయిన్ గత కొంత కాలంగా ఈ ప్రాంతంపై దాడులు చేస్తున్నట్లు, ఆదివారం కూడా ఇక్కడ దాడి జరిగినట్లు రష్యా పేర్కొంది.

కాగా రాడార్‌లతో కూడిన వాయు రక్షణ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకోవడానికి రూపొందించబడిన హార్మ్‌ క్షిపణులు 48 కిలోమీటర్ల కంటే ఎక్కువ పరిధిని కలిగి ఉంటాయి. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అమెరికా ఈ విధమైన ఆయుధాలను ఉక్రెయిన్‌కు సరఫరా చేస్తున్న సంగతి తెలిసిందే. వీటి ద్వారా ఉక్రెయిన్‌పై రష్యా దాడులను తిప్పికొట్టడానికి సాధ్యపడింది. దీంతో వరుస పరాజయాలతో తోకముడిచిన రష్యా.. తాజాగా మళ్లీ ఉక్రెయిన్‌పై దాడులకు దిగింది. ఉక్రెయిన్‌లోని పలు నగరాలపై డ్రోన్లు, రాకెట్లతో ఆదివారం వరుస దాడులకు పాల్పడింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.