Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: ఈ అంకుల్ మామూలోడు కాదు.. ఆయన వేసే స్టెప్పులకు ఫిదా అవ్వాల్సిందే.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..

ఈ మధ్య సోషల్ మీడియా ప్రభావంతో చాలా మంది చాలా సులభంగా ఫేమస్ అయిపోతుండగా కొందరు మాత్రం నెటిజన్లను పడిపడి నవ్వుకునేలా చేస్తున్నారు. ఈ వీడియోలు కూడా చాలా సరదాగా ఉంటాయి. అందుకే చాలా..

Watch Video: ఈ అంకుల్ మామూలోడు కాదు.. ఆయన వేసే స్టెప్పులకు ఫిదా అవ్వాల్సిందే.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..
Man Who Dances For Ddlj Song
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Dec 20, 2022 | 9:43 AM

భారతదేశంలో విడుదలైన సినిమాలు, పాటలు కేవలం మన దేశానికి మాత్రమే పరిమితం కాదు. మన తెలుగు, హిందీ పాటలకు ఇతర దేశాలవారు డ్యాన్స్ వేసిన సందర్భాలు కూడా చాలానే ఉంటాయి. అస్ట్రేలియన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కూడా అలా డ్యాన్స్ వేసినవారి కోవకే వస్తాడని ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. ఇక ఈ మధ్య సోషల్ మీడియా ప్రభావంతో చాలా మంది చాలా సులభంగా ఫేమస్ అయిపోతుండగా కొందరు మాత్రం నెటిజన్లను పడిపడి నవ్వుకునేలా చేస్తున్నారు. ఈ వీడియోలు కూడా చాలా సరదాగా ఉంటాయి. అందుకే చాలా మంది ప్రజలు తమ తమ ఖాళీ సమయాలలో వైరల్ వీడియోలను, ఇన్‌స్టాలోని ఫన్నీ రీల్స్ చూస్తుంటారు. అలాంటి ఫన్నీ వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతోంది. వైరల్ అవడమే కాదు..పొట్ట చెక్కలయేలా నవ్వించేస్తోంది.

వైరల్ అవుతున్న ఆ వీడియోలో  ఓ ఫారెనర్ బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ ‘దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే’లోని ‘మెహెంది లగా కే రఖ్నా..’ పాటకు డ్యాన్స్ వేయడాన్ని మనం చూడవచ్చు. ఇక ఈ వీడియోను చూస్తే అతను చాలా బాగా డ్యాన్స్ చేశాడని కూడా చెప్పవచ్చు.  కానీ అతను వేసినంత ఏనర్జిటిక్‌గా ఇంత వరకు ఎవరూ చేయలేదని చెప్పుకోవచ్చు. అతను డ్యాన్స్ చేస్తుంటే అచ్చం మరో మహిళ డ్యాన్స్ వేసినట్లే ఉంది.  ఈ వీడియోలోని విశేషమేమిటంటే  డ్యాన్స్ వేేసిన మొత్తం సమయంలో అతను తన చిరునవ్వుతోనే కనిపించాడు.  నిజానికి ఆయన నలుగురి పిల్లల తండ్రి. అయినప్పటికీ చాలా ఉత్సాహంగా, చురుకుగా డ్యాన్స్ వేస్తున్నాడు.

ఇవి కూడా చదవండి

నెట్టింట వైరల్ అవుతున్న వీడియోను ఇక్కడ చూడండి..

View this post on Instagram

A post shared by Ricky Pond (@ricky.pond)

ricky.pond అనే ఇన్‌స్టా ఖాతా నుంచి షేర్ అయిన ఈ వీడియోకు ఇప్పటివరకు దాదాపు 57 వేల మందికి పైగా వీక్షించారు. ఇంకా మూడు వేలకు పైగా లైకులు కూడా వచ్చాయి. ఇక వీడియోను చూసిన నెటిజన్లు చాలా సరదాగా స్పందిస్తున్నారు. ఓ నెటిజన్ ‘ ఈ పాట దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే సినిమాలో నుంచి తీసుకున్నది’ అని రాయగా, మరొకరు ‘అంకుల్ డ్యాన్స్ అద్భుతం’ అని కామెంట్ చేశాడు. ఇలా నెటిజన్లు వారివారి స్పందనలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..