AP CM Jagan: అమెరికా తెలుగు మహాసభల కోసం సీఎం జగన్‌కు ఆహ్వానం.. ప్రత్యేకంగా ఇన్వైట్ చేసిన నాటా సభ్యులు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌కు వచ్చే ఏడాది అమెరికాలో జరిగే తెలుగు మహాసభలకు ఆహ్వనం అందింది. ఈ మేరకు నార్త్ అమెరికా తెలుసు అసోసియేషన్(నాటా) అధ్యక్షుడు..
ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌కు వచ్చే ఏడాది అమెరికాలో జరిగే తెలుగు మహాసభలకు ఆహ్వనం అందింది. ఈ మేరకు నార్త్ అమెరికా తెలుసు అసోసియేషన్(నాటా) అధ్యక్షుడు డాక్టర్ శ్రీధర్ రెడ్డి, అసోసియేషన్ ఇతర సభ్యులు సోమవారం గుంటూరు జిల్లా తాడేపల్లిలో ముఖ్యమంత్రిని కలిశారు. ఆ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌ను శాలువాతో సన్మానించిన నాటా సభ్యులు.. అమెరికాలో తాము నిర్వహించే మహాసభలకు హాజరు కావాలంటూ ఆహ్వానించి ఇన్విటేషన్ లెటర్ అందజేశారు.
అయితే నాటా తెలుగు మహాసభలు వచ్చే ఏడాది(2023) జూన్ 30 నుంచి జులై 2 అమెరికాలోని డాలస్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా జరగనున్నాయి. ఇక మహాసభలకు సీఎంను ఆహ్వానించిన కార్యక్రమంలో నాటా ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీధర్‌రెడ్డి కొరసపాటి, ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ప్రతాప్ రెడ్డి భీమిరెడ్డి, నాటా సభ్యులు ఉన్నారు.
నాటా తెలుగు మహాసభలకు సీఎం వైయస్ జగన్‌ను ఆహ్వనించిన నాటా ప్రెసిడెంట్, సభ్యులు. 2023 జూన్ 30–జులై 02 వరకు డాలస్‌లోని డాలస్ కన్వెన్షన్ సెంటర్లో నాటామహాసభలు. సీఎంను ఆహ్వనించిన నాటా ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీధర్‌రెడ్డి, ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ప్రతాప్ రెడ్డి,నాటా సభ్యులు. pic.twitter.com/nQKnrgjuEV
— YSR Congress Party (@YSRCParty) December 19, 2022
కాగా, అమెరికాలోని నార్త్ అమెరికా తెలుసు అసోసియేషన్(నాటా) సభ్యులు తెలుగు మహా సభలను అక్కడ 2012 సంవత్సరం నుంచి ఘనంగా జరుపుతున్నారు. అశేష ప్రజావాహిని మధ్య జరిగే ఈ సభలలో అమెరికాలోని ఉన్నవారితో పాటు చుట్టుపక్కల దేశాల నుంచి కూడా తెలుగువారు వచ్చి పాల్గొంటారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్ కోసం