Actor Vishal : ఇవాళ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలవనున్న విశాల్.. కారణం ఇదేనా..
విశాల్ రాజకీయాల్లోకి రానున్నారని గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆంద్రప్రదేశ్ లోని కుప్పం నుంచి ఆయన పోటీ చేస్తారని కూడా టాక్ వచ్చింది.
తమిళ్ స్టార్ హీరో విశాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమిళ్ తో పాటు తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితుడు. ఆయన నటించిన సినిమాలన్నీ తెలుగులో కూడా డబ్ అయ్యి మంచి విజయాలను అందుకుంటుంటాయి. హిట్లు, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడిపేస్తున్నాడు విశాల్. త్వరలోనే లాఠీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇదిలా ఉంటే ఇటీవల విశాల్ చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలిచాయి. విశాల్ రాజకీయాల్లోకి రానున్నారని గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆంద్రప్రదేశ్ లోని కుప్పం నుంచి ఆయన పోటీ చేస్తారని కూడా టాక్ వచ్చింది. చంద్రబాబు పై పోటీకి విశాల్ సిద్ధం అవుతున్నారన్న వార్తలు ప్రచారం కావడంతో విశాల్ క్లారిటీ ఇచ్చారు. తాను రాజకీయాల్లోకి వస్తున్న మాట వాస్తవమే అన్నారు. కానీ కుప్పం నుంచి పోటీ చేస్తా అని మాత్రం ఆయన చెప్పలేదు.
ఇదిలా ఉంటే ఇవాళ ఏపీ సీఎం జగన్‌ను కలుస్తున్నారు హీరో విశాల్. జగన్ అంటే తనకు చాలా ఇష్టం అని ఆయన అన్నారు. జగన్ సీఎం అవుతారని తాను పాదయాత్ర సమయంలోనే చెప్పానన్నారు. లాఠీ సినిమా ప్రమోషన్‌లో తిరుపతికి వచ్చిన విశాల్.. ఇవాళ సీఎం జగన్‌తో భేటీ కానున్నారు. అయితే ఈ మీటింగ్‌కి రాజకీయ ప్రధాన్యత లేదన్నారు. తాను వైసీపీ నుంచి ఎలాంటి సీటు ఆశించడం లేదని క్లారిటీ ఇచ్చారు విశాల్.
కుప్పుంలో చంద్రబాబుపై పోటీకి దిగుతున్నారంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదన్నారు. కుప్పంలో ప్రతివీధి తనకు బాగా తెలుసన్నారు. తనకు ఒక ఎమ్మెల్యే కన్నా ఎక్కువ సంపాదన, ఎక్కువ ప్రజాభిమానం సినిమాల్లో ఉందన్నారు. తాను ఏపీ రాజకీయాల్లోకి రానని స్పష్టం చేశారు.