Childhood Photo: అమ్మను ఆప్యాయంగా హత్తుకున్న ఈ క్యూటీ ఎవరో తెలుసా..? ఇప్పుడు అందానికే కేరాఫ్ అడ్రస్ ఈ భామ
పైన కనిపిస్తున్న ముద్దుగుమ్మ కూడా అదే కోవకు చెందింది. టాలీవుడ్ లో వరుస సినిమాలు చేసి.. ఇప్పుడు ఇక్కడ ఆఫర్లు తగ్గడంతో బాలీవుడ్ ను నమ్ముకుంది. ఇంతకు ఈ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా..?
చాలా మంది హీరోయిన్ ఇతరభాషల నుంచి చాలా మంది హీరోయిన్ టాలీవుడ్ లోకి అడుగుపెట్టి రాణిస్తున్నారు. అలాగే ఇక్కడ స్టార్ డమ్ వచ్చిన తర్వాత కొంతమంది బాలీవుడ్ కు చెక్కేస్తున్నారు. పైన కనిపిస్తున్న ముద్దుగుమ్మ కూడా అదే కోవకు చెందింది. టాలీవుడ్ లో వరుస సినిమాలు చేసి.. ఇప్పుడు ఇక్కడ ఆఫర్లు తగ్గడంతో బాలీవుడ్ ను నమ్ముకుంది. ఇంతకు ఈ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా..? అమ్మను ఆప్యాయంగా హత్తుకున్నా ఈ చిన్నారి ఇప్పుడు చాలా మంది కుర్రాళ్ళ కలల రాకుమారి. దాదాపు తెలుగులో స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది ఈ చిన్నది. ఇంతకు ఈ క్యూటీ ఎవరో కనిపెట్టలేక పోయారా..?
పై ఫొటోలో అమ్మతో కలిసి చిరునవ్వులు చిందిస్తూ ఫొటోకు ఫోజ్ ఇచ్చిన చిన్నది ఎవరో కాదు.. మిల్కీ బ్యూటీ తమన్నా.. మంచు మనోజ్ నటించిన శ్రీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది తమన్నా. ఆ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన హ్యాపీ డేస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆతర్వాత వరుసగా టాలీవుడ్ లో ఆఫర్లు అందుకుంది.
ఇక్కడ దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది తమన్నా. ఈ మధ్య కాలంలో తమన్నా జోరు తగ్గిందనే చెప్పాలి. దాదాపు ఈ బ్యూటీ బాలీవుడ్ లో అదృష్టం పరీక్షించుకోవాలని ట్రై చేస్తుంది. కానీ అక్కడ కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేక పోయింది. అలాగే వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తుంది. రీసెంట్ గా గుర్తుందా శీతాకాలం అనే సినిమా చేసింది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..