OTT: ఓటీటీలో సందడి చేయడానికి సిద్ధమైన ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’.. ఎందులో, ఎప్పటి నుంచంటే..
అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'. నాందిలో నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించి ప్రేక్షకులకు మెప్పించిన నరేష్ కమర్షియల్ హంగులకు దూరంగా నటించిన చిత్రం ఇది. ఏఆర్ మోహన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా..
అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం‘. నాందిలో నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించి ప్రేక్షకులకు మెప్పించిన నరేష్ కమర్షియల్ హంగులకు దూరంగా నటించిన చిత్రం ఇది. ఏఆర్ మోహన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నవంబర్ 25వ తేదీన విడుదలైన మంచి టాక్ దక్కించుకుంది. ఈ సినిమాలో నరేష్ ఎన్నికల విధులు నిర్వహించే ప్రభుత్వ అధికారిగా అద్భుత నటనను కనబరిచాడు. రాజకీయ వ్యవస్థను ప్రశ్నించడం అనే కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది.
ఇదిలా ఉంటే థియేటర్లలో మెప్పించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో సందడి చేయడానికి సిద్ధమైంది. సినిమా విడుదలైన దాదాపు నెల రోజుల తర్వాత ఓటీటీలో విడుదల కానుంది. ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం చిత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 వేదికగా విడుదలవుతోంది. క్రిస్మస్ కానుకగా సినిమాను విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. డిసెంబర్ 23వ తేదీ నుంచి సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన జీ5 వెల్లడించింది. నిజానికి జీ5 తొలుత ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరిలో స్ట్రీమింగ్ చేయనున్నారని వార్తలు వచ్చాయి. అయితే అనుకున్న సమయానికంటే ముందుగానే సినిమాను స్ట్రీమింగ్ చేస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..