Unstoppable 2 with NBK: నారి నారి నడుమ నందమూరి.. ముగ్గురు భామలతో బాలకృష్ణుడు..
నటసింహం నందమూరి బాలకృష్ణలో మరో కోణాన్ని బయట పెడుతూ సూపర్ సక్సెస్ గా ముందుకెళ్తోంది అన్ స్టాపబుల్. బాలయ్య తనదైన శైలిలో వచ్చిన గెస్ట్ లను ఆటపట్టిస్తూ.. మాటలతో తికమక పెడుతూ..
ఆహా అందిస్తున్న సూపర్ టాక్ షో అన్ స్టాపబుల్ .. అద్భుతమైన ప్రజాదరణ పొందుతూ దూసుకుపోతోంది. రోజు రోజుకు ఈ టాక్ షో పై క్రేజ్ పెరిగిపోతోంది. నటసింహం నందమూరి బాలకృష్ణలో మరో కోణాన్ని బయట పెడుతూ సూపర్ సక్సెస్ గా ముందుకెళ్తోంది అన్ స్టాపబుల్. బాలయ్య తనదైన శైలిలో వచ్చిన గెస్ట్ లను ఆటపట్టిస్తూ.. మాటలతో తికమక పెడుతూ అలరిస్తున్నారు. ఇప్పటికే అన్ స్టాపబుల్ సీజన్ వన్ పూర్తి చేసుకొని.. సీజన్ 2లోకి అడుగుపెట్టింది. ఈ సీజన్ లో మునుపటి సీజన్ కు మించి డబుల్ ఎనర్జీతో హోస్ట్ చేస్తున్నారు బాలయ్య. ఇప్పటికే పలువురు రాజకీయ ప్రముఖులతో పాటు యంగ్ హీరోలు కూడా ఈ షోకు హాజరయ్యారు. త్వరలోనే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఎపిసోడ్ కూడా స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న డార్లింగ్ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో యూట్యూబ్ లో రికార్డులు క్రియేట్ చేస్తోంది. డార్లింగ్ తో బాలయ్య ఎలాంటి కబుర్లు పంచుకున్నారు అన్నది తెలుసుకోవడానికి ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే
ఈ ఎపిసోడ్ కంటే ముందు మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో రానున్నారు బాలయ్య. ఈ ఎపిసోడ్ లో అలనాటి అందాల తారలు జయసుధ, జయప్రదతో పాటు లేటెస్ట్ సెన్సేషన్ రాశిఖన్నా కూడా హాజరయ్యారు. ఈ ముద్దు ముద్దుగుమ్మలతో బాలయ్య సరదా సంభాషణకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలు బాలయ్య చిలిపి ప్రశ్నలు, గెస్ట్ ల సరదా సమాధానాలు ఆకట్టుకున్నాయి.
అలాగే ఈ ప్రోమోలో రాశీను తాను నటించిన హీరోల్లో ఎవరు నీ క్రష్.? అని అడగ్గా విజయ్ దేవరకొండ అని చెప్పింది. అలాగే జయప్రద మాట్లాడుతూ.. తన షూటింగ్ ఆపుకొని మరీ జయసుధను పెళ్లికూతురిని చేయడానికి వెళ్ళాను అని తెలిపారు. అలాగే ఈ ముగ్గురు భామలతో బాలయ్య సెప్పులేసి అదరగొట్టారు. ఈ ఎపిసోడ్ డిసెంబర్ 23న స్ట్రీమింగ్ కానుంది.