Rajeev Rayala |
Updated on: Dec 20, 2022 | 12:08 PM
నేషనల్ క్రష్ రష్మిక ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ ఒకరు . ఛలో సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రష్మిక మందన్న 'పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ సంపాదించుకుంది.
కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ చిన్నది ఇప్పుడు టాలీవుడ్ లో లీడ్ హీరోయిన్ గా మారింది. కేవలం తెలుగులోనే కాదు తమిళ్, హిందీ భాషల్లోనూ సినిమాలు చేస్తూ పాన్ ఇండియా హీరోయిన్ అనే ట్యాగ్ సంపాదించుకుంటుంది.
ఇక ఈ అమ్మడు తెలుగు రీసెంట్ గా చేసిన పుష్ప సినిమా ఏ రేంజ్ లో హిట్ అయ్యింది అందరికి తెలిసిందే. అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించారు.
పార్ట్ వన్ కంటే పుష్ప 2లో రష్మిక రోల్ ఎక్కువ ఉంటుందని టాక్. ఇదిలా ఉంటే అటు బాలీవుడ్ లోనూ వరుస అవకాశాలు అందుకుంటుంది. అలాగే తమిళ్ లో దళపతి విజయ్ నటిస్తున్న వారసుడు సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది రష్మిక. ఈ మధ్య వార్తల్లో ఎక్కువగా ఉంటోంది రష్మిక
నిన్నమొన్నటి వరకు కాంతార సినిమాపై రష్మిక చేసిన వ్యాఖ్యల కారణంగా వార్తల్లో నిలిచింది. ఇక ఇప్పుడు డ్రసింగ్ తో హాట్ టాపిక్ గా మారింది. ఇక తాజాగా మరొకసారి రష్మిక ధరించిన డ్రెస్ వల్ల వార్తల్లోకి ఎక్కింది
ఇటీవల ఓ ఈవెంట్ లో బ్లాక్ బెల్ట్ కరాటేకు సంబంధించిన మోడల్ లో డ్రెస్ ధరించి సందడి చేసింది నేషనల్ క్రష్. కరాటేకు సంబంధించిన డ్రెస్ ధరించటంతో ప్రస్తుతం ఆమెను ట్రోల్ చేస్తున్నారు కొందరు నెటిజన్లు.