Samantha: ఆ ప్రాజెక్టుల నుంచి సమంత తప్పుకుందా.? క్లారిటీ ఇచ్చిన సామ్ టీమ్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిన దగ్గర నుంచి..

Samantha: ఆ ప్రాజెక్టుల నుంచి సమంత తప్పుకుందా.? క్లారిటీ ఇచ్చిన సామ్ టీమ్
Samantha
Follow us
Ravi Kiran

|

Updated on: Dec 20, 2022 | 7:12 PM

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిన దగ్గర నుంచి ఆమె ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సామ్ ఇంతకు ముందు ఉన్నత హుషారుగా ఎక్కడా కనిపించకపోవడంతో వారంతా కూడా మరింతగా బెంగ పెట్టుకున్నారు. కొద్దిరోజుల క్రితం సామ్‌ తనకు మయోసైటిస్ అనే వ్యాధి సోకినట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదొక ప్రాణాంతక వ్యాధి అయినప్పటికీ త్వరగానే కోలుకుంటానంటూ చికిత్స తీసుకుంటున్న ఫొటోను కూడా సామాజిక మాధ్యమంలో షేర్ చేసారు సమంత. దీంతో ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు, శ్రేయోభిలాషులు కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే సమంత ఇప్పట్లో నటించడం కష్టమేనని.. పలు బాలీవుడ్ చిత్రాల నుంచి సమంత తప్పుకున్నట్లు సామాజిక మాధ్యమాల్లో పలు వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇక దీనిపై తాజాగా సామ్ టీమ్ స్పందించింది. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని.. అవన్నీ పూర్తి అవాస్తవమని క్లారిటీ ఇచ్చారు.

‘సమంత ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. సంక్రాంతి తర్వాత విజయ్ దేవరకొండతో ‘ఖుషీ’ సినిమా షూటింగ్‌లో పాల్గొంటారు. అనంతరం ఆమె ఒప్పుకున్న హిందీ ప్రాజెక్టులను పూర్తి చేస్తారు. సినిమా షూటింగ్‌ కోసం దర్శక నిర్మాతలను వేచి చూసేలా చూడటం మంచి విషయం కాదు. ఒకవేళ షూటింగ్‌లో పాల్గొనడం సాధ్యం కాకపోతే.. వారి షెడ్యూల్ ప్రకారం షూటింగ్స్ పూర్తి చేసుకోమని ముందే స్పష్టం చేశాం. ఇప్పటిదాకా సమంత ఒప్పుకున్న ఏ ప్రాజెక్టు నుంచి తప్పుకోలేదు. కొత్త సినిమాలు ఏవీ కూడా ఒప్పుకోలేదు. సమంత తర్వాతి చిత్రాల విషయంలో సోషల్ మీడియా చక్కర్లు కొడుతోన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు’ అని సమంత పీఆర్ టీమ్ వివరణ ఇచ్చింది.