Mollywood: ఉరివేసుకుని ప్రముఖ కమెడియన్ భార్య ఆత్మహత్య.. షాక్‌లో సినిమా ఇండస్ట్రీ
మానసిక సమస్యలతోనే ఆశా ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె తండ్రి శివానందన్ చెబుతున్నారు. తమ కూతురు, అల్లుడి మధ్య ఎలాంటి గొడవలు లేవని, ఈ విషయంపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయడం లేదని ఆయన పేర్కొన్నాడు. అయితే పోలీసులు మాత్రం కేసును విచారణ చేస్తామని వెల్లడించారు.
సినిమా ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. మలయాళ సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖ కమెడియన్ ఉల్లాస్ పండళం సతీమణి బలవన్మారణానికి పాల్పడింది. కేరళలోని పతనంతిట్ట జిల్లా పండలంలోని వారి నివాసంలో ఆమె ఉరి వేసుకుని చనిపోయింది. అయితే తన భార్య ఆశా(38) కనిపించడం లేదని ఉల్లాస్ కేరళ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సమాచారం అందుకున్న కేరళ పోలీసులు అతని నివాసానికి వెళ్లగా.. ఆమె ఫ్యాన్‌కు వేలాడుతూ విగతజీవిగా కనిపించింది. అయితే ఉల్లాస్ ఇంట్లో ఉన్నప్పుడే ఆశా ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు భావిస్తున్నారు. ఆమె చనిపోయే ముందు రోజు మొదటి అంతస్తులో తన పిల్లలతో కలిసి నిద్రపోయినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఆశా, ఉల్లాస్‌ల మధ్య చిన్నపాటి గొడవ జరిగిందని, అందుకే ఆమె మొదటి అంతస్తుకు వెళ్లి నిద్రపోయినట్లు తెలుస్తోంది. ఉల్లాస్ వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్న కేరళ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా మానసిక సమస్యలతోనే ఆశా ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె తండ్రి శివానందన్ చెబుతున్నారు. తమ కూతురు, అల్లుడి మధ్య ఎలాంటి గొడవలు లేవని, ఈ విషయంపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయడం లేదని ఆయన పేర్కొన్నాడు. అయితే పోలీసులు మాత్రం కేసును విచారణ చేస్తామని వెల్లడించారు.
మలయాళ సినీ పరిశ్రమలో ఉల్లాస్ పండళంకు ఎంతో క్రేజ్ ఉంది. మమ్ముట్టి నటించిన దైవతింటే సొంతం క్లీటస్ తో వెండితెరకు పరిచయమమైన ఆయన ఇతు తాండ పోలీస్, కాముకి, మన్నార్ మత్తై స్పీకింగ్ 2, హాస్యం, కర్ణన్ నెపోలియన్ భగత్ సింగ్ తదితర చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కొన్ని టీవీ షోల్లోనూ నటించి బుల్లితెర ప్రేక్షకుల అభిమానం గెల్చుకున్నాడు. అతని చేతిలో ప్రస్తుతం అంబలముక్కిలే విశేషాలు, సవారి గిరి గిరి వంటి క్రేజీ సినిమాలు ఉన్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..