AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: క్రిస్మస్‌కు డబుల్ ధమాకా.. ఈ వారం థియేటర్లలోకి వచ్చే చిత్రాలివే.!

గత వారం విజువల్ వండర్ 'అవతార్ 2' కోసం అన్ని భాషలలోని పలు చిత్రాల రిలీజ్‌ను వాయిదా వేసుకున్నాయి. ఇప్పుడు అవన్నీ కూడా..

Tollywood: క్రిస్మస్‌కు డబుల్ ధమాకా.. ఈ వారం థియేటర్లలోకి వచ్చే చిత్రాలివే.!
Theatre Movies
Ravi Kiran
|

Updated on: Dec 20, 2022 | 3:25 PM

Share

గత వారం విజువల్ వండర్ ‘అవతార్ 2’ కోసం అన్ని భాషలలోని పలు చిత్రాల రిలీజ్‌ను వాయిదా వేసుకున్నాయి. ఇప్పుడు అవన్నీ కూడా ఈ వీకెండ్‌లో థియేటర్లలోకి వచ్చేస్తున్నాయి. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్, కోలివుడ్ ఇండస్ట్రీలలో కొన్ని చిత్రాలు విడుదలకు క్యూ కట్టాయి. మరి ఆ లిస్టు ఏంటో చూసేద్దాం..

ధమాకా:

రవితేజ, శ్రీలీల ప్రధాన పాత్రల్లో దర్శకుడు త్రినాధరావు నక్కిన తెరకెక్కించిన చిత్రం ‘ధమాకా’. ఈ చిత్రంలో రవితేజ డ్యుయల్ రోల్‌లో కనిపించనున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా వస్తోన్న ఈ చిత్రం డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది.

18 పేజెస్:

నిఖిల్, అనుపమ జంటగా తెరకెక్కిన చిత్రం ’18 పేజెస్’. ఈ చిత్రానికి దర్శకుడు సుకుమార్ కథ అందించగా.. డైరెక్టర్ సూర్యప్రతాప్ పల్నాటి దర్శకత్వం వహించారు. ఈ నెల 23న థియేటర్లలో సందడి చేయనుంది.

లాఠీ:

విశాల్ కథానాయకుడిగా దర్శకుడు వినోద్ కుమార్ రూపొందిన చిత్రం ‘లాఠీ’. ఇందులో సునయన హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీకి యువన్‌ శంకర్‌ రాజా సంగీతాన్ని అందించారు. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 22వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది.

సర్కస్:

రణ్‌వీర్‌ సింగ్‌, పూజాహెగ్డే, జాక్వెలైన్‌ ఫెర్నాండెజ్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం సర్కస్. రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించాడు. ఈ సినిమా ఈనెల 23 విడుదల కానుంది. వీటితో పాటు నయనతార ‘కనెక్ట్’, పృథ్వీ సుకుమారన్ ‘కాప’ డిసెంబర్ 22న, కన్నడ హీరో శివ రాజ్‌కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘వేద’ డిసెంబర్ 23న రిలీజ్ అవుతున్నాయి.

Follow Us
ఏపీలో మరో బాలుడు మిస్సింగ్.. బయటకెళ్లి తిరిగిరాని రేయాన్స్‌
ఏపీలో మరో బాలుడు మిస్సింగ్.. బయటకెళ్లి తిరిగిరాని రేయాన్స్‌
ఆ హీరో దేవుడు.. గొప్ప సినిమాలు చేశారు..
ఆ హీరో దేవుడు.. గొప్ప సినిమాలు చేశారు..
ఆకలితో ఫుట్ పాత్ మీద నిల్చున్నాను.. పిలిచి అన్నం పెట్టాడు..
ఆకలితో ఫుట్ పాత్ మీద నిల్చున్నాను.. పిలిచి అన్నం పెట్టాడు..
నటుడు సాక్షి రంగారావు ఎలా మరణించారో తెలుసా..
నటుడు సాక్షి రంగారావు ఎలా మరణించారో తెలుసా..
ఎద్దుకు ఘనంగా అంత్యక్రియలు.. కన్నీరు పెట్టిస్తున్న సంఘటన
ఎద్దుకు ఘనంగా అంత్యక్రియలు.. కన్నీరు పెట్టిస్తున్న సంఘటన
వారెవ్వ అదిరిపోయే వంటకం ఇదే..బక్కగా అవ్వాలి అనుకునే వారికి బెస్ట్
వారెవ్వ అదిరిపోయే వంటకం ఇదే..బక్కగా అవ్వాలి అనుకునే వారికి బెస్ట్
చేపల పులసును తలదన్నే అడవి కాకరకాయ పులుసు..ఇలా చేస్తే రుచి అద్భుతం
చేపల పులసును తలదన్నే అడవి కాకరకాయ పులుసు..ఇలా చేస్తే రుచి అద్భుతం
గద్వాల్ చేనేత చీరలో నాగ చైతన్య సతీమణి శోభిత.. ఫొటోస్ ఇదిగో
గద్వాల్ చేనేత చీరలో నాగ చైతన్య సతీమణి శోభిత.. ఫొటోస్ ఇదిగో
వెల్లుల్లి కేవలం వంటలకే కాదు.. టాయిలెట్‌లోని క్రిములకు చెక్
వెల్లుల్లి కేవలం వంటలకే కాదు.. టాయిలెట్‌లోని క్రిములకు చెక్
అఖిల్‌- జైనబ్.. ఒకరినొకరు ముద్దుగా ఏమని పిల్చుకుంటారో తెలుసా?
అఖిల్‌- జైనబ్.. ఒకరినొకరు ముద్దుగా ఏమని పిల్చుకుంటారో తెలుసా?