Mohan Babu: పోలీసులపై సంచలన కామెంట్స్ చేసిన మోహన్ బాబు.. డిపార్ట్‌మెంట్ అంటే గౌరవం ఉందంటూనే..
. ఏదైన ఘటన జరిగినప్పుడు పోలీసులకే వాస్తవాలు తెలుస్తాయంటున్న మోహన్‌బాబు.. ఆ డిపార్ట్‌మెంట్ అంటే తనకు గౌరవం ఉందన్నారు
హీరో విశాల్ నటించిన లాఠీ అనే సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విశాల్ తిరుపతిలో లాఠీ ప్రీరిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మోహన్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక ఈవెంట్ లో మోహన్ బాబు చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి.ఈ సందర్భంగా మాట్లాడిన మోహన్ బాబు పోలీసులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏదైన ఘటన జరిగినప్పుడు పోలీసులకే వాస్తవాలు తెలుస్తాయంటున్న మోహన్‌బాబు.. ఆ డిపార్ట్‌మెంట్ అంటే తనకు గౌరవం ఉందన్నారు. మోహన్ బాబు మాట్లాడుతూ.. తమిళనాడు నుంచి మన తెలుగు బిడ్డ విశాల్ ఇక్కడి వచ్చాడనీ, మనం ఆయన్ను ప్రేమించాలి, గౌరవించాలనీ. మా సినిమాలకు సంబంధించిన వేడుకలకు మినహా తాను గత 8 ఏళ్ల నుంచి బయటి వాటికి వెళ్లడంలేదని అన్నారు మోహన్ బాబు. విశాల్ తనతో ‘అంకుల్.. తిరుపతిలో ఫంక్షన్ ఉంది. మీరు రావాలి’ అని కోరడంతో వెంటనే ఓకే అని చెప్పానని అన్నారు మోహన్ బాబు.
అలాగే ఈ వేదికపై నుంచి పోలీసులపై మోహన్ బాబు చేసిన కామెంట్లు ఇప్పుడు హాట్ టాపిగ్గా మారాయి. పోలీస్ డిపార్ట్ మెంట్ అంటే తనకెంతో గౌరవంగా ఉందంటూనే.. వారికి మాత్రమే సమాజంలోని నిజానిజాలన్నీ స్పష్టంగా తెలుస్తాయంటూనే. వారు ప్రభుత్వాలకు తొత్తులుగా మారారని కామెంట్ చేశారు. ఐఏఎస్, ఐపీఎస్ లు సైతం ప్రభుత్వాలకు కొమ్ము కాయడం తనను బాధిస్తోందిని అన్నారు ఒకనాటి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు.
దొంగపోలీస్ వంటి పలు చిత్రాల్లో పోలీస్ కేరెక్టర్లను వేసి ప్రేక్షకులను మెప్పించిన మోహన్ బాబు.. పోలీసులపై సన్సేషనల్ కామెంట్ చేశారు. వారిని ప్రభుత్వాలకు తొత్తులు గా పని చేసేవారని అభివర్ణించారు మోహన్ బాబు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.