AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vishwaroop: మా ఇంట్లో టికెట్ల రగడ లేదు.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా.. చాలా కాలం తర్వాత ప్రజల్లోకి మంత్రి

రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ మళ్లీ ప్రజల్లోకి వచ్చారు. కొన్ని రోజులుగా అనారోగ్యం కారణంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న ఆయన.. ఇప్పుడు కోలుకోవడంతో రీయాక్టివేట్‌..

Vishwaroop: మా ఇంట్లో టికెట్ల రగడ లేదు.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా.. చాలా కాలం తర్వాత ప్రజల్లోకి మంత్రి
Minister Vishwaroop
Subhash Goud
|

Updated on: Dec 20, 2022 | 7:06 AM

Share

రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ మళ్లీ ప్రజల్లోకి వచ్చారు. కొన్ని రోజులుగా అనారోగ్యం కారణంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న ఆయన.. ఇప్పుడు కోలుకోవడంతో రీయాక్టివేట్‌ అయ్యారు. గడపగడపకూ కార్యక్రమానికి హాజరయ్యారు. కొడుకుతోపాటు ఆయన ఇంటింటికీ తిరిగారు. ఈనేపథ్యంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అమలాపురం నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా తానే పోటీ చేస్తానని విశ్వరూప్‌ క్లారిటీ ఇచ్చారు. వానపల్లిపాలెంలో జరిగిన కార్యక్రమంలో ఈ కామెంట్‌ చేశారు. తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా సీఎం జగన్‌ ఆమోదంతో తన కొడుకు డాక్టర్‌ శ్రీకాంత్‌తో కలిసి ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని పునఃప్రారంభించామన్నారు.

మరో కుమారుడు కృష్ణారావు కూడా అప్పుడప్పుడు ఈ కార్యక్రమంలో పాల్గొంటాడన్నారు విశ్వరూప్‌. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఎన్నికల్లో తానే బరిలో ఉంటానని.. తమ కుటుంబంలో ఎటువంటి విబేధాలు లేవన్నారు. అయితే వానపల్లిపాలెంలో జరిగిన గడపగడపకు కార్యక్రమానికి ఇద్దరు కుమారులు హాజరైనప్పటికీ శ్రీకాంత్‌తోనే కలిసి మంత్రి కార్యక్రమంలో పాల్గొన్నారు. మరోవైపు. ఈ కార్యక్రమంలో ఓ మహిళ నుంచి నిరసన సెగ తగిలింది. అమలాపురం అల్లర్ల కేసులో తన కుమారుడిని అక్రమంగా ఇరికించి తమ కుటుంబానికి ఉపాధి లేకుండా చేశారంటూ ఆరోపించింది ఆ మహిళ.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి