E-Ration Card: మీ రేషన్ కార్డ్ పోయిందా..? అయితే అన్‌లైన్‌ ద్వారా ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..

మీ రేషన్ కార్డు పోయిందాం.. లేదా ఎక్కడైనా పెట్టి మర్చిపోయారా..? చింతించకండి. ఇంట్లోనే కూర్చొని ఈ రేషన్ కార్డ్‌ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి..

శివలీల గోపి తుల్వా

|

Updated on: Dec 20, 2022 | 8:00 AM

ఈ-రేషన్ కార్డ్ డౌన్‌లోడ్: రేషన్ కార్డ్ అనేది కుటుంబ గుర్తింపుగా పనిచేసే ప్రభుత్వ పత్రమే కాక పేదప్రజలకు తక్కువ ధరలకే రేషన్‌ను అందించడంలో సహాయపడే కార్డ్. ఒకవేళ మీరు మీ రేషన్ కార్డును ఎక్కడైనా పోగుట్టుకున్నట్లయితే బాధపడనవసరం లేదు. ఇంట్లోనే కూర్చుని ఈ-రేషన్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మరి అది ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5
ఈ-రేషన్ కార్డ్‌ను ఎవరు డౌన్‌లోడ్ చేయవచ్చు..?: ఆధార్ కార్డ్ నంబర్, మొబైల్ నంబర్‌ను మీ రేషన్ కార్డ్‌కి లింక్ చేసినప్పుడే మీరు ఈ-రేషన్ కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రేషన్ కార్డ్‌తో మొబైల్ నెంబర్‌ను లింక్ చేసినవారే ఈ-రేషన్ కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకోగలుగుతారు.

2 / 5
ఈ -రేషన్ కార్డ్ డౌన్‌లోడ్ చేయడం ఎలా..?: ముందుగా మీరు nfsa.gov.in అనే ప్రభుత్వ వెబ్‌సైట్‌కి వెళ్లాలి. ఈ సైట్‌ని ఓపెన్ చేసిన వెంటనే హోమ్‌పేజీలో మీకు రేషన్ కార్డ్ అనే ఎంపిక కనిపిస్తుంది. ఈ ఎంపికకు వెళ్లగానే మీకు స్టేట్ పోర్టల్‌లో రేషన్ కార్డ్ వివరాలు కనిపిస్తాయి. మీరు దానిపై క్లిక్ చేయాలి.

3 / 5
స్టేట్ పోర్టల్‌లోని రేషన్ కార్డ్ వివరాలపై క్లిక్ చేసిన వెంటనే, మీ ముందు వివిధ రాష్ట్రాల పేర్లు కనిపిస్తాయి. మీరు ఏ రాష్ట్రానికి చెందినవారయితే ఆ రాష్ట్రాన్ని  ఎంచుకోండి.

4 / 5
 ఈ-రేషన్ కార్డును డౌన్‌లోడ్ చేయడానికి రేషన్ కార్డ్ నంబర్, కుటుంబ పెద్ద పేరు, కుటుంబ పెద్ద ఆధార్ కార్డ్ నంబర్, పుట్టిన తేదీ, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ వంటి వివరాలను మీరు తెలియజేయవలసి ఉంటుంది. అడిగిన సమాచారాన్ని మీరు నమోదు చేసిన తర్వాత  మీ రిజిస్టర్డ్ నంబర్‌కు OTP వస్తుంది. మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPని నమోదు చేయండి. తర్వాత ఈ-రేషన్ కార్డును PDF ఫార్మాట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

5 / 5
Follow us