young woman: హాస్టల్‌లో ఉంటే మాత్రం.. ఇదేం కోరిక తల్లీ.! తాను వచ్చేసరికి రెడీచేయాల్సినవి వాట్సప్‌ చేసిన యువతి

young woman: హాస్టల్‌లో ఉంటే మాత్రం.. ఇదేం కోరిక తల్లీ.! తాను వచ్చేసరికి రెడీచేయాల్సినవి వాట్సప్‌ చేసిన యువతి

Anil kumar poka

|

Updated on: Dec 20, 2022 | 9:45 AM

హాస్టల్‌లో ఉంటున్న ఓ యువతి ఐదు నెలల తర్వాత తన ఇంటికి వెళ్తోంది. ఈ క్రమంలో తనకు ఇష్టమైన వంటకాలు అన్నీ చేయించి రెడీ పెట్టమని తన తండ్రికి ఓ లిస్ట్‌ వాట్సప్‌లో పంపింది.


శిక్ష అనే ఈ అమ్మాయి హాస్టల్‌నుంచి ఇంటికి రావాడానికి నాలుగు రోజుల ముందే ఓ పెద్ద లిస్టును తన తండ్రికి వాట్సాప్‌ చేసింది. డిసెంబరు 16న తను ఇంటికి వస్తున్నానని, తాను వచ్చే సరికి చికెన్‌ కబాబ్‌ నుంచి మటన్‌ బిర్యానీ, ఫిష్‌ టిక్కా ఇలా చేంతాడంత జాబితాను తండ్రికి పంపింది. ఒకింత ఆశ్చర్యానికి గురైన తండ్రి శ్వేతన్క్‌ సరదాగా ఆ జాబితాను ట్విటర్‌లో పోస్టు చేశారు. దీంతో అది వైరల్‌గా మారింది. దీనిపై యూజర్లు రకరకాల కామెంట్లు గుప్పిస్తున్నారు. ‘ఇంతకు ముందు మా అమ్మాయి కూడా ఇలాగే లిస్టు పెట్టేది. ఇప్పుడామెకు 8 ఏళ్ల వయస్సున్న కొడుకు కూడా ఉన్నాడు. కానీ, ఆ అలవాటు మాత్రం పోలేదు. పైగా వాళ్ల భర్త, కొడుకుకు కావాల్సిన లిస్టు కూడా దీనికి జతకలిసింది’ అని ఓ యూజర్‌ కామెంట్‌ చేశాడు. వామ్మో 5 నెలలకే ఇంత లిస్ట్‌ చెప్తే ఐదేళ్లయితే ఇంకెంత లిస్ట్‌ చెబుతుందో అంటున్నారు మరికొందరు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Partners Relationship: సంసారంలో స్మార్ట్‌గా చిచ్చు.. ఇలాగైతే మొదటికే మోసం..! వైవాహిక జీవితం బాగుండాలి అంటే..

Shocking Video: ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా గూడె కట్టేశాయి.. చెవి స్కానింగ్‌లో బయటపడ్డ షాకింగ్ సీన్..

Murder: దారుణం.. అప్పు ఇచ్చిన పాపానికి గొంతు, నరాలు కోసి హత్య చేసారు.! పోలీసులు ఏమ్మన్నారు అంటే..

 

Published on: Dec 20, 2022 09:26 AM