Shocking Video: స్కూల్లో చెకింగ్‌కి వెళ్లిన అధికారులు.. ఓ క్లాస్ రూమ్ డోర్ ఓపెన్ చేయగానే..
స్కూల్లోనే గబ్బు పనికి దుకాణం తెరిచారు. పిల్లలు విద్యాబుద్దులు నేర్చుకునే చోట లిక్కర్ దందాకు తెరతీశారు. ఒక ప్రైవేట్ పాఠశాల ఆవరణలో నడుస్తున్న అక్రమ డిస్టిలరీ గుట్టు రట్టు చేశారు
పాఠశాల ఆవరణలో దేశీయ మద్యం తయారీ యూనిట్ పనిచేస్తుండటం.. పోలీసులు, ఎక్సైజ్ శాఖకు దాని గురించి ఎటువంటి సమాచారం ఉండకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాఠశాలలోని ఓ క్లాస్ రూమ్‌లో భారీ మొత్తంలో మద్యం సీసాలు భద్రపరిచినట్లు అందిన సమాచారం మేరకు ఎక్సైజ్ శాఖ ప్రత్యేక బృందం డిసెంబర్ 11 ఉదయం పాఠశాలపై దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో 6 లక్షల విలువైన ముడిసరుకు, ఖాళీ సీసాలు, ప్యాక్ చేసిన బాటిళ్లతో పాటు లిక్కర్ రవాణాకు ఉపయోగించిన కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ యూనిట్ నుంచి సమీపంలోని దాబాలు, హోటళ్లకు మద్యం సరఫరా చేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అరెస్టు చేసిన వారిని అదే రోజు కోర్టులో హాజరుపరిచారు. పాఠశాల ఆవరణలో ఇంత కాలం యూనిట్ ఎలా నడుస్తుందో తెలుసుకోవడానికి ఎక్సైజ్ శాఖ విచారణ ప్రారంభించింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Rat Job: ఎలుకల్ని పట్టుకుంటే ..రూ. కోటి 38 లక్షల జీతం..! కొత్త పోస్ట్‌కు మేయర్ ప్రకటన..