Army Tank: సైనికుడి ఇంటి ముందు ఆగివున్న ఆర్మీ ట్యాంకర్.. ఆశ్చర్యపోతున్న స్థానికులు, నెటిజన్లు.
ఓ సైనికుడి ఇంటి ముందు కనిపించిన ఆసక్తికర దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు
కేరళలో రాష్ట్రం కొల్లంలోని కరిప్రాకు చెందిన ఆర్మీ అధికారి ప్రవీణ్ ఇంటి ముందు యుద్ధ ట్యాంకర్ ప్రత్యక్షమైంది. అయితే, దూరంనుంచి చూస్తే అది యుద్ధంలో శత్రువులను నాశనం చేసే యుద్ధ ట్యాంకర్‌లా అనిపిస్తుంది. కానీ, దగ్గరివెళ్లి చూస్తే మాత్రం అందరూ నోరెళ్లబెడతారు. ఎందుకుంటే, అది బాంబులు వేసే యుద్ధ ట్యాంకర్ కాదు. చల్లటి నీటిని పంచే బావి. అతని ఇంటి ముందున్న బావి ఆర్మీ ట్యాంక్ ఆకారంలో నిర్మించారు. ఇక ఆ సైనికుడి ఇంటి పేరు కూడా కాశ్మీర్. ఓ సైనికుడి అభిరుచికి తగ్గట్టుగా ఆ ఇంటిని నిర్మించినట్టు చెబుతున్నారు. అంతేకాదు, ఈ యుద్ధ ట్యాంకర్ బావి నిర్మాణం వెనుక ప్రవీణ్ కొడుకు కోరిక కూడా ఉందట. ప్రవీణ్ కొడుకు కూడా తండ్రికి తగ్గట్టుగానే సైనికులకు సంబంధించిన ఆయుధాల బొమ్మలంటే ఇష్టపడతాడట. దాంతో అతని కోరిక మేరకు ఇలాంటి ఇంటి నిర్మాణం చేస్తున్నట్టుగా చెప్పారు. తిరువనంతపురంలో ప్రదర్శించిన పాత ట్యాంకర్ మోడల్ కొలతల ఆధారంగా ఈ ‘బావి’ ట్యాంక్‌ను సిమెంట్‌తో తయారు చేశారట. మొత్తానికి ఈ ఇంటి నిర్మాణం మాత్రం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఫోటోలు చూసిన నెటిజన్లు సదరు సైనికుడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Rat Job: ఎలుకల్ని పట్టుకుంటే ..రూ. కోటి 38 లక్షల జీతం..! కొత్త పోస్ట్‌కు మేయర్ ప్రకటన..