Electric bike: తిరుగులేని ఈ-బైక్! మరీ ఇంత స్మార్ట్ ఏంటి బాసూ! ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

Okinawa Okhi90 పేరుతో మన దేశంలో లాంచ్ అయ్యింది. ఈ బైక్ ఏంటి? అందులోని ఫీచర్లు ఎలా ఉన్నాయి? ధర ఎంత? మైలేజీ ఎంత? స్పెసిఫికేషన్లు వంటి విషయాలను తెలుసుకుందాం..

Electric bike: తిరుగులేని ఈ-బైక్! మరీ ఇంత స్మార్ట్ ఏంటి బాసూ! ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!
Okinawa Okhi 90
Follow us
Madhu

|

Updated on: Dec 22, 2022 | 1:25 PM

మీరు ఈ కొత్త సంవత్సరంలో ఒక ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే మీకో శుభవార్త. అత్యాధునిక సౌకర్యాలు, అద్భుత ఫీచర్లు, అనువైన ధరలో ఒక బైక్ అందుబాటులోకి వచ్చింది. Okinawa Okhi90 పేరుతో మన దేశంలో లాంచ్ అయ్యింది. ఈ బైక్ ఏంటి? అందులోని ఫీచర్లు ఎలా ఉన్నాయి? ధర ఎంత? మైలేజీ ఎంత? స్పెసిఫికేషన్లు వంటి విషయాలను తెలుసుకుందాం..

ఫీచర్లు ఇవి..

Okinawa Okhi90 బైక్ పూర్తి ఎల్ఈడీ లైటింగ్ తో వస్తుంది. కాంతిని ఆటోమేటిక్ గా అడ్జస్ట్ చేసుకుంటుంది. ఒక చార్జింగ్ పోర్ట్, బూట్ లైట్, కీ లేకుండానే ఆపరేట్ చేసేలా అధునాతన సదుపాయం ఉంది. పూర్తి డిజిటలైజ్డ్ సెటప్ తో వినియోగదారులకు అద్భుత అనుభూతిని అందిస్తుంది. మ్యూజిక్ కంట్రోల్, బ్యాటరీ చార్జ్ స్టేటస్, స్మార్ట్ ఫోన్ కనెక్టెవిటీ, కాలర్ ఇన్ఫర్మేషన్ వంటివి స్క్రీన్ పై కనిపిస్తాయి. అలాగే థెప్ట్ అలారమ్ కూడా అందుబాటులో ఉంది.

స్పెసిఫికేషన్లు..

Okinawa Okhi90 బండి 3800W సామర్థ్యం కలిగిన ఎలక్ట్రిక్ మోటార్ తో వస్తుంది. అలాగే మార్చుకోదగిన 72V, 50Ah లిథియం ఐయాన్ బ్యాటరీ ఉంటుంది. ఈ స్కూటర్ లో ఎకో, స్పోర్ట్స్ అనే రెండు డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి. ఎకో మోడ్ లో 55 నుంచి 60 కిలోమీటర్ల స్పీడ్ తో వెళ్తుంది. ఇక స్పోర్ట్స్ మోడ్ లో అయితే 85 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. అంతేకాక కేవలం పది సెకన్లోనే 90 కిలోమీటర్ల స్పీడ్ను అందుకోగలదని ఆ కంపెనీ ప్రకటించుకుంది. బ్యాటరీ ఒకసారి చార్జ్ చేస్తే 160 కిలోమీటర్లు వస్తుంది. బ్యాటరీ ఫుల్ గా చార్జ్ అవడానికి 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. 16-inch అల్లాయ్ వీల్స్ తో పాటు టెలిస్కోపిక్ ఫ్రంట్ బ్రేక్స్, రెండు వైపులా డిస్క్ బ్రేకులు ఉంటాయి.

ఇవి కూడా చదవండి

ధర ఎంతంటే..

Okhi90 బైక్ ధర మన ఇండియాలో రూ. 1.21 లక్షలు ఉండే అవకాశం ఉంది. రాష్ట్రాల్లోని అన్నీ సబ్సీడీలు కలుపుకుంటే రేటులో మార్పు కనిపిస్తుంది. గ్లోసీ వైన్ రెడ్, గ్లోసీ పెరల్ వైట్, గ్లోసీ యాష్ గ్రే, గ్లోసీ బ్లూ రంగుల్లో అందుబాటులో ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!