EPFO Update: పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. ఈ వివరాలను అప్‌డేట్ చేయండి.. లేకపోతే నగదు విత్‌డ్రా కష్టమే..

ఈపీఎఫ్ చందాదారుడు ఉద్యోగం నుంచి రిటైర్మెంట్ అయినా.. లేదా వరుసగా 2 నెలలకు పైగా నిరుద్యోగిగా ఉన్నా EPF మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు.

EPFO Update: పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. ఈ వివరాలను అప్‌డేట్ చేయండి.. లేకపోతే నగదు విత్‌డ్రా కష్టమే..
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 25, 2022 | 6:52 PM

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఉద్యోగుల సౌలభ్యం కోసం పలు సేవలను విస్తరించింది. పీఎఫ్‌ నగదును ఉపసంహరించుకునే ప్రక్రియ నుంచి నామినీ తదితర వివరాలను అప్డేట్ చేయడం లాంటి వాటిని ఆన్‌లైన్‌ చేసింది. అయితే, పీఎఫ్‌ ఖాతా నుంచి డబ్బును విత్‌డ్రా చేయాలనుకుంటే, ముందుగా మీరు మీ PF ఖాతాలోని కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్‌లను అప్‌డేట్ చేయాలి. లేకుంటే మీరు PF డబ్బును విత్‌డ్రా చేయడంలో అనేక ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) ఖాతాలో జమ చేసిన మొత్తాన్ని సులభంగా పాక్షికంగా లేదా పూర్తిగా విత్‌డ్రా చేసుకోవచ్చు. పీఎఫ్ విత్‌డ్రాను అన్ని సందర్భాల్లో చేసుకోవచ్చు. చందాదారుడు ఉద్యోగం నుంచి రిటైర్మెంట్ అయినా.. లేదా వరుసగా 2 నెలలకు పైగా నిరుద్యోగిగా ఉన్నా EPF మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు.

వివాహం, మెడికల్ ఎమర్జెన్సీ, హోమ్ లోన్ చెల్లింపు వంటి పరిస్థితుల్లో కూడా ఈ ఫండ్‌లో డిపాజిట్ చేసిన మొత్తంలో కొంత భాగాన్ని కొన్ని షరతుల ప్రకారం విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే, పదవీ విరమణకు ముందు PF డబ్బును ఉపసంహరించుకోవాలనుకుంటే దానిలోని కొన్ని పత్రాలు (PF పత్రాలు) అప్డేట్ చేయడం అవసరం. ఈ డాక్యుమెంట్స్ సహాయంతో పీఎఫ్ డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు.

ఉద్యోగుల సంక్షేమం కోసం.. భారత ప్రభుత్వం ఎంప్లాయిస్‌ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ 1951 సంవత్సరంలో స్థాపించింది. దీనిని భారత ప్రభుత్వంలోని కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తుంది. కార్మిక మంత్రిత్వ శాఖ EPF కార్యక్రమాలను నియంత్రించడంతోపాటు.. సౌలభ్యాల కల్పన, వడ్డీ, బీమా తదితర వాటిని పర్యవేక్షిస్తుంది.

ఇవి కూడా చదవండి

పీఎఫ్‌ నగదును ఉపసంహరించుకోవడానికి అవసరమైన పత్రాలు

  • రెండు రెవెన్యూ స్టాంపులు.
  • కంపోసిట్‌ క్లయిమ్‌ ఫామ్‌. బ్యాంక్ ఖాతా వివరాలు (బ్యాంక్ ఖాతా PF ఖాతాదారుడి పేరు మీద మాత్రమే ఉండాలి).
  • గుర్తింపు కార్డు ( గుర్తింపు రుజువు )
  • చిరునామా వివరాలు
  • బ్యాంకు IFSC కోడ్
  • బ్యాంక్ ఖాతా నంబర్‌తో కూడిన క్యాన్సిల్‌ చేసిన చెక్
  • పుట్టిన తేదీ, తండ్రి పేరు వంటి వ్యక్తిగత వివరాలు, గుర్తింపు రుజువుతో స్పష్టంగా సరిపోలేలా ఉండే పత్రాలు..
  • ఉద్యోగి ఉద్యోగం చేసే సమయంలో లేదా విరమణకు 5 సంవత్సరాల ముందు తన PF విత్‌డ్రా వివరాలు.
  • PF ఖాతాలో జమ చేసిన మొత్తానికి సంబంధించిన వివరాలు, ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) ఫారమ్ 2, 3 కావాల్సి ఉంటుంది.
  • ఈ వివరాలన్నీ అప్డేట్ గా ఉంటే.. పీఎఫ్ నగదు ఉపసంహరించడం సులభం అవుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే