India Corona: కరోనా టెర్రర్‌ను ఎదుర్కోవడానికి రెడీ.. దేశమంతా మాక్‌డ్రిల్ నిర్వహించిన కేంద్రం..
కరోనా ముప్పును ఎదుర్కోవడానికి అన్ని విధాలా సిద్దంగా ఉన్నట్టు కేంద్రం స్పష్టం చేసింది. దేశమంతా కరోనా మాక్‌డ్రిల్‌ను విజయవంతంగా నిర్వహించారు.
కరోనా ముప్పును ఎదుర్కోవడానికి అన్ని విధాలా సిద్దంగా ఉన్నట్టు కేంద్రం స్పష్టం చేసింది. దేశమంతా కరోనా మాక్‌డ్రిల్‌ను విజయవంతంగా నిర్వహించారు. ముక్కు ద్వారా వేసే నాసల్ వ్యాక్సిన్ ధరలను భారత్ బయోటెక్ ప్రకటించింది.
కోవిడ్ కొత్త వేరియంట్ ముప్పు కారణంగా ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు కేంద్రం స్పష్టం చేసింది. చైనా సహా మరికొన్ని దేశాల్లో ఆస్పత్రుల సామర్థ్యాన్ని మించి నమోదవుతున్న కోవిడ్-19 కొత్త వేరియంట్ కేసుల కారణంగా భారత ప్రభుత్వం సంసిద్ధతను పరిశీలించేందుకు దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించింది. కోవిడ్-19 చికిత్స కోసం ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల సంసిద్ధతను నిర్ధారించడమే ఈ కసరత్తు ప్రధానోద్దేశమని కేంద్ర మంత్రి మాండవియా తెలిపారు. మాక్ డ్రిల్‌లో భాగంగా ఆయన ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిని సందర్శించారు.
కోవిడ్ మహమ్మారి సమయంలో వైద్యులు ఆదర్శప్రాయంగా పనిచేసినందుకు మాండవీయ న ప్రశంసించారు. అదే సమయంలో ఈ మహమ్మారి విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు తగిన నివారణ చర్యలను అనుసరించాలని కోరారు. ధృవీకరించని సమాచారాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా వైరల్ చేయడం మానుకోవాలని హితవు పలికారు.ఈ క్రమంలో చికిత్సను అందించే పరికరాలు, మందులు, మెడికల్ ఆక్సిజన్, మానవ వనరుల పరంగా మొత్తం కోవిడ్ వైద్య కార్యాచరణ సంసిద్ధత తెలుసుకోవడం చాలా ముఖ్యమని అన్నారు.
ప్రైవేట్ ఆస్పత్రుల్లో 800 రూపాయలకు లభ్యం..
మరోవైపు ముక్కు ద్వారా వేసే ఇన్‌కోవాక్ నాసల్ వ్యాక్సిన్ ధరలను భారత్ బయోటెక్ ప్రకటించింది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో టీకా 800 రూపాయలకు లభిస్తుంది. దీనికి అదనంగా పన్నులు కూడా ఉంటాయి. ప్రభుత్వానికి మాత్రం 320 రూపాయల చొప్పున టీకాను విక్రయించాలని నిర్ణయించారు. జనవరి చివరి వారం నుంచి మనదేశంలో భారత్ బయోటెక్ నాసల్ టీకా అందుబాటు లోకి రానుంది. కోవిన్ యాప్‌లో నాసల్ వ్యాక్సిన్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
18 ఏళ్లు నిండినవారు కొవాగ్జిన్, కొవిషీల్డ్‌తో పాటు బూస్టర్ డోస్‌గా రెండు చుక్కల టీకాను తీసుకోవచ్చని సూచించారు. అమెరికాలో వాషింగ్టన్ యూనివర్సిటీకి చెందిన సెయింట్ లూయిస్ స్కూల్‌తో కలిసి భారత్ బయోటెక్ ఈ టీకాను అభివృద్ధి చేసింది. కోవిడ్-19ను ఇన్‌కోవాక్ సమర్ధంగా నిరోధిస్తుంది ఎందుకంటే ఇది మ్యూకోసల్ రోగనిరోధక శక్తిని అందిస్తుందని భారత్ బయోటెక్ ఎండీ, ఛైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్ల గతంలోనే తెలిపారు.
చైనాలో కరోనా టెర్రర్ మరింత విజృంభించింది. ఐసీయూల్లో బెడ్స్ లేవని ఆస్పత్రులు స్పష్టం చేస్తున్నాయి. ఇకపై కేసుల సంఖ్యను నెలకు ఓసారి మాత్రమే విడుదల చేస్తామని చైనా ప్రభుత్వం ప్రకటించింది.
Andaman & Nicobar Islands | Dr Bharati Pravin Pawar, MoS Health and Family Welfare inspected and reviewed the COVID-19 preparedness Mock Drill at GB Pant Hospital, Port Blair. pic.twitter.com/mWUt4eROJ3
— ANI (@ANI) December 27, 2022
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..