AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas on Unstoppable : ఫ్యాన్స్ గెట్ రెడీ.. ఒక రోజు ముందే బాలయ్య – ప్రభాస్ ఎపిసోడ్

ఈ టాక్ షోను నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ టాక్ షో కు ఇప్పటికే చాలా మంది సెలబ్రెటీలు గెస్ట్ లుగా వచ్చారు. మొదటి సీజన్ సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న అన్ స్టాపబుల్..

Prabhas on Unstoppable : ఫ్యాన్స్ గెట్ రెడీ.. ఒక రోజు ముందే బాలయ్య - ప్రభాస్ ఎపిసోడ్
Prabhas
Rajeev Rayala
|

Updated on: Dec 29, 2022 | 3:59 PM

Share

ప్రేక్షకులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బాలయ్య, ప్రభాస్ ఎపిసోడ్ నుంచి క్రేజీ ఆప్డేట్ ఇచ్చారు ఆహా టీమ్. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా లో టెలికాస్ట్ అవుతోన్న నెంబర్ వన్ టాక్ షో అన్ స్టాపబుల్. ఈ టాక్ షోను నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ టాక్ షో కు ఇప్పటికే చాలా మంది సెలబ్రెటీలు గెస్ట్ లుగా వచ్చారు. మొదటి సీజన్ సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న అన్ స్టాపబుల్.. ఇప్పుడు సీజన్ 2లో కూడా అదే ఉత్సహంతో దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే ఈ షోకు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ ఎపిసోడ్ ను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ క్రమంలో ప్రభాస్ ఎపిసోడ్ కు సంబంధించిన మొదటి పార్ట్ ను ఈ రోజు (గురువారం)రాత్రి 9 గంటల నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు. ముందుగా ఈనెల 30 నుంచి మొదటి పార్ట్ ను స్ట్రీమింగ్ చేయాలనుకున్నారు.

కానీ ఇప్పుడు ఈ ఎపిసోడ్ ను ఒక రోజు ముందుగానే స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు ఆహా టీమ్. అభిమానుల డిమాండ్ నేపథ్యంలో బాహుబలి మొదటి ఎపిసోడ్ ను ఒక రోజు ముందుగానే స్ట్రీమింగ్ చేయనున్నారు. సోషల్ మీడియా వేదికగా సరికొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇక మొదటి ఎపిసోడ్ లో కేవలం ప్రభాస్ మాత్రమే ఉంటాడు. ఆయనతో బాలయ్య చేసే సందడి, సరదా కబుర్లు చూపించనున్నారు. అలాగే రెండో పార్ట్ లో ప్రభాస్ తో పాటు అతని మిత్రుడు గోపీచంద్ కూడా జాయిన్ అవ్వనున్నాడు. ఈ ఇద్దరు ఇండస్ట్రీలో ఎలాంటి స్ట్రగుల్స్ ఎదుర్కొన్నారు అన్నది ఈ ఎపిసోడ్ ను చూపించనున్నారు. ఇది జనవరి 6న స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ రెండు ఎపిసోడ్స్ కు అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే బిగినింగ్ అని.. రెండో పార్ట్ కు అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే ది కంక్లూజన్ అని పేరుపెట్టారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్
షాలినీనే టార్గెట్ చేసిన కొత్త కంటెస్టెంట్లు!
షాలినీనే టార్గెట్ చేసిన కొత్త కంటెస్టెంట్లు!
తెలుగురాష్ట్రాల్లో ఈ రోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
తెలుగురాష్ట్రాల్లో ఈ రోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
అలర్ట్.. ఈ వారంలో బ్యాంక్ సెలవులు ఇవే..
అలర్ట్.. ఈ వారంలో బ్యాంక్ సెలవులు ఇవే..
రూ.5 కోట్ల లంచం డిమాండ్‌.. పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ అరెస్ట్‌!
రూ.5 కోట్ల లంచం డిమాండ్‌.. పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ అరెస్ట్‌!
మేషం నుంచి మీనం వరకు.. సోమవారం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు?
మేషం నుంచి మీనం వరకు.. సోమవారం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు?
'నాలో వారికి ఏం నచ్చిందో తెలియదు' బిచ్చగాడికి 21 మంది భార్యలు!
'నాలో వారికి ఏం నచ్చిందో తెలియదు' బిచ్చగాడికి 21 మంది భార్యలు!