AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adivi Sesh: నయా మూవీ అనౌన్స్ చేసిన యంగ్ హీరో.. గూఢచారి సీక్వెల్ నుంచి క్రేజీ అప్డేట్

ఈ క్రమంలోనే రీసెంట్ గా మేజర్, హిట్ 2 సినిమాలతో విజయాలు అందుకున్నాడు. ఇక శేష్ నటించిన సినిమాలో అతడికి మంచి పేరు తీసుకొచ్చిన సినిమా గూఢచారి.

Adivi Sesh: నయా మూవీ అనౌన్స్ చేసిన యంగ్ హీరో.. గూఢచారి సీక్వెల్ నుంచి క్రేజీ అప్డేట్
adivi sesh
Rajeev Rayala
|

Updated on: Dec 29, 2022 | 4:21 PM

Share

టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ హీరో అడవి శేష్ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. కెరీర్ బిగినింగ్ నుంచి వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ మంచి హిట్స్ ను తన ఖాతాలో వేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే రీసెంట్ గా మేజర్, హిట్ 2 సినిమాలతో విజయాలు అందుకున్నాడు. ఇక శేష్ నటించిన సినిమాలో అతడికి మంచి పేరు తీసుకొచ్చిన సినిమా గూఢచారి. శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 2018లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో శోభిత దూళిపాళ్ల హీరోయిన్ గా నటించింది. శశికిరణ్ దర్శకత్వంలోనే శేష్ మేజర్ అనే సినిమా కూడా చేశాడు. ఈ సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లో హిట్ సాధించింది.

ఇక ఇప్పుడు గూఢచారి సినిమాకు సీక్వెల్ రాబోతుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇదిలావుండగా అడివి శేష్ తన పాత్ బ్రేకింగ్ మూవీ ‘గూఢాచారి’ సీక్వెల్ ని G2 పేరుతో తదుపరి ప్రాజెక్ట్ గా ప్రకటించారు. G2 టీం “ప్రీ విజన్” వీడియోను జనవరి 9వ తేదీనఢిల్లీ, ముంబైలో ఒకే రోజున విడుదల చేయనున్నారు. “మేజర్” చిత్ర ఎడిటర్ వినయ్ కుమార్ సిరిగినీడి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. శేష్ స్వయంగా కథ రాశారు. ఈ భారీ-బడ్జెట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ని మూడు ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ లు కలసి నిర్మిస్తున్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

వీరి కొలాబరేషన్ లో ది కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2, మేజర్ చిత్రాలు ఆల్ ఇండియన్ హిట్స్ గా నిలవడం గమనార్హం. మేకర్స్ ఈ చిత్రం కాన్సెప్ట్ పోస్టర్ ను కూడా విడుదల చేసారు. ఇందులో బ్లాక్ సూట్ లో చేతిలో మెషిన్ గన్ పట్టుకుని, అతను యాక్షన్ ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాడని తెలియజేస్తోంది. గూఢాచారి కథ మొత్తం భారతదేశంలోనే జరగగా, G2 అంతర్జాతీయంగా ఉండబోతోంది. ఆల్ప్స్ పర్వతాలలో గూఢాచారి ముగిసిన ప్రదేశం నుండి గూఢచారి పార్ట్ 2 ప్రారంభమవుతుంది. ఇప్పటికే ఉన్న స్టార్ కాస్ట్ తో అనేక కొత్త పాత్రలు చేరి రెట్టింపు యాక్షన్ ను డిజైన్ చేయాలని మేకర్స్ కోరుకుంటున్నారు.

G2

G2

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్