Waltair Veerayya: వాల్తేరు వీరయ్య పాటపై వివాదం.. యండమూరి ప్రశ్నకు చంద్రబోస్ రియాక్షన్ ఇదే..
Yandamuri vs Chandrabose: ఈ సాంగ్ విషయంలో ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. దీనిపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి.
Chiranjeevi – Waltair Veerayya: చిరంజీవి హీరోగా, రవితేజ ప్రధానపాత్రలో నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా టైటిల్ ఇటీవలే సోషల్ మీడియాలో విడుదలైంది. అయితే, ఈ సాంగ్ విషయంలో ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. దీనిపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఆ పాట రాసిన లిరిక్ రైటర్ ఎవరంటూ యండమూరి చేసిన కామెంట్స్‌పై.. వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్ రాసిన చంద్రబోస్ ఘాటుగా స్పందించారు. అర్థం తెలియకుండా మాట్లాడే వాళ్లకు.. చెప్పినా అర్థం కాదంటూ కౌంటర్ ఇచ్చారు. అసలు యండమూరి ఏమన్నారు.. దానిపై చంద్రబోస్ రియాక్షన్ ఏంటి? అనేది ఇప్పుడు చూద్దాం..
తుఫాన్ అంచున తపస్సు చేసే వశిష్టుడే వీడే.. తిమిరనేత్రమై ఆవరించిన త్రినేత్రుడే..
ఈ పదాలు వాడుతూ.. అసలు ఈ పాట రాసిన వాడికి పురాణకథలు తెలుసా.. అతడేం చదివాడు.. తిమిరము అంటే అర్థం తెలుసా నీకు..? శివదూషణ కాదా ఇది.. ఏమిటీ పిచ్చి రాతలు.. తెలుగు సిని కవిత్వం వేటూరి మరణంతో మసకబారి దీపం అయింది.. సిరివెన్నెల మరణం ఆ కాస్త దీపాన్ని ఆర్పేసింది అంటూ యండమూరి పోస్ట్ చేశారు.
దీనిపై సోషల్ మీడియా వేదికగా గత కొన్ని గంటలుగా చర్చ జరుగుతూనే ఉంది..
తాజాగా ఈ విషయంపై వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్ రాసిన చంద్రబోస్ స్పందించారు. తాను ఏ ఉద్దేశ్యంతో ఈ పాటలోని పదాలు వాడాల్సి వచ్చిందో వివరించారు. తను శివదూషణ చేయలేదని, హీరో పాత్ర స్వభావాన్ని మాత్రమే అందులో ప్రతిబింబించేలా పదాలు రాశానని తెలిపారు. చిరంజీవి గారూ, సత్యానంద్ గారూ పాట విన్న తర్వాత.. ఇది అధ్యయనం చేయాల్సిన పాట అంటూ ప్రశంసించారని తెలిపారు.
యండమూరి వీరేంద్రనాథ్ చేసిన ప్రతీ విమర్శకు తనదైన శైలిలో సమాధానమిచ్చారు చంద్రబోస్. ఈ పాట విరోధాబాసాలంకారంలో సాగుతుందని తెలిపారు. అభినందనలు తెలపాల్సిన సాహిత్యానికి విమర్శలు చేయడం సరికాదన్నారు.
30 ఏళ్ళ కింద సినిమా పాటలు రాయకముందే తాను తిమిరహరనం అనే పదప్రయోగం చేశానంటూ కొసమెరుపుగా చంద్రబోస్ చెప్పుకొచ్చారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..