AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sharwanand: యంగ్ హీరో శర్వానంద్ మ్యారేజ్ ఫిక్స్.. వధువు తెలంగాణ అమ్మాయే..

యంగ్ హీరో శర్వానంద్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. తను ప్రేమించిన అమ్మాయి మెడలో మూడు ముళ్లు వేయబోతున్నాడు. ఈ సమ్మర్‌లో వివాహం జరగనుంది.

Sharwanand: యంగ్ హీరో శర్వానంద్ మ్యారేజ్ ఫిక్స్.. వధువు తెలంగాణ అమ్మాయే..
Hero Sharwanand
Ram Naramaneni
|

Updated on: Jan 05, 2023 | 8:31 AM

Share

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్ట్‌లో యంగ్ హీరో శర్వానంద్ కూడా ఒకరు. ఈ హీరో వయస్సు ప్రజంట్ 38. దీంతో బాబు పెళ్లి పీటలు ఎప్పుడు ఎక్కుతాడా అని ఇంట్లో డైలీ డిస్కషన్ అట. ఇంట్లోనే కాదు బయట కూడా ఇదే ప్రశ్న ఎదురవుతుందట. అంతెందుకు నిన్న గాక మొన్న ఆహాలో అన్‌స్టాపబుల్ 2 కు గెస్ట్‌గా వచ్చిన సందర్భంలో కూడా బాలయ్య ఇదే ప్రశ్న అడగ్గా మాట దాటవేశాడు శర్వానంద్. తాజాగా శర్వా పెళ్లికి ఓకే చెప్పేశాడు. అంతేకాదు మ్యాచ్ కూడా ఫిక్స్ అయిందండోయ్. వధువు అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అట.

ఈ ఏడాది వేసవిలో పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేశారు. వధువు తెలంగాణ ప్రాంతానికి చెందిన అమ్మాయిగా తెలిసింది. ఆమె తాలుకా పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. అయితే ఇది లవ్ మ్యారేజ్ అనే మాట కూడా వినిపిస్తుంది. ఆ అమ్మాయి శర్వాకు చాలాకాలంగా తెలుసట. రెడ్డి సామాజిక వర్గం అమ్మాయితో శర్వా ఏడడుగులు వేయబోతున్నట్లు సమాచారం. ఆ అమ్మాయి వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా ప్రజంట్ హైదరాబాద్‌లోనే ఉంటుందట.

కాగా టాలీవుడ్‌లో స్టార్స్ సంగతి పక్కన బెడితే.. యాక్టర్స్ లిస్ట్‌లో ముందుంటాడు శర్వా. తొలుత చిన్న చిన్న క్యారెక్టర్లు వేస్తూ.. ఆ తర్వాత మంచి స్కిప్టులు సెలక్ట్ చేసుకుని.. మంచి నటుడు అనిపించుకుని… ఆపై కమర్షియల్ హీరోగా ఎదిగాడు. గతేడాది ఒకే ఒక జీవితం సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ప్రజంట్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, సితార బ్యానర్లలో 2 సినిమాలు చేస్తున్నాడు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
టమాటో రసం ఇలా పెడితే మూడు రోజులు ఫ్రెష్
టమాటో రసం ఇలా పెడితే మూడు రోజులు ఫ్రెష్
ఆలయాలను పదే పదే సందర్శిస్తున్నారా? నిజమైన దైవ దర్శనం అర్థం ఇదేనట!
ఆలయాలను పదే పదే సందర్శిస్తున్నారా? నిజమైన దైవ దర్శనం అర్థం ఇదేనట!
దసరా, దీపావళి సెలవుల్లో ఊరెళ్తున్నారా? ఈ తప్పు అస్సలు చేయొద్దు
దసరా, దీపావళి సెలవుల్లో ఊరెళ్తున్నారా? ఈ తప్పు అస్సలు చేయొద్దు
9 కాదు.. 16 రోజుల నవరాత్రులు! 500 ఏళ్ల నాటి పుస్తకంతో పూజలు..
9 కాదు.. 16 రోజుల నవరాత్రులు! 500 ఏళ్ల నాటి పుస్తకంతో పూజలు..
డాబాపై తులసి మొక్కను పెంచుతున్నారా? ఈ వాస్తు నియమాలు తెలుసుకోండి!
డాబాపై తులసి మొక్కను పెంచుతున్నారా? ఈ వాస్తు నియమాలు తెలుసుకోండి!
నరాల బలహీనత తగ్గి.. శరీరం ఉక్కులా మారుతుంది..
నరాల బలహీనత తగ్గి.. శరీరం ఉక్కులా మారుతుంది..
కళ్లముందే కాఫీ.. ఐనా ఆన్సర్ ‘టీ’ చెప్పాడు.. UPSC ఇంటర్వ్యూ ప్రశ్న
కళ్లముందే కాఫీ.. ఐనా ఆన్సర్ ‘టీ’ చెప్పాడు.. UPSC ఇంటర్వ్యూ ప్రశ్న
పంజాగుట్ట-జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ ఫ్లైఓవర్‌పై బిగ్ అప్డేట్
పంజాగుట్ట-జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ ఫ్లైఓవర్‌పై బిగ్ అప్డేట్
అబ్బబ్బా.. మూడు మహా యాగాలు.. వీరికి పట్టిందల్లా బంగారమే..!
అబ్బబ్బా.. మూడు మహా యాగాలు.. వీరికి పట్టిందల్లా బంగారమే..!
చిన్నప్పటి నుంచి వస్తున్నా.. ఇలా ఎప్పుడూ జరగలేదు
చిన్నప్పటి నుంచి వస్తున్నా.. ఇలా ఎప్పుడూ జరగలేదు