Vijay Thalapathy-Ajith Kumar: ముదురుతున్న స్టార్ ఫ్యాన్స్ వార్.. ఆ హీరోను కించపరుస్తూ పోస్టర్స్..

బాలీవుడ్.. టాలీవుడ్ కంటే కోలీవుడ్ లో ఎక్కువగా ఈ ఫ్యాన్స్ వార్ జరుగుతుంటుంది. ముఖ్యంగా దళపతి విజయ్, అజిత్ అభిమానుల మధ్య తీవ్రస్థాయిలో వివాదాలు చెలరేగుతుంటాయి.

Vijay Thalapathy-Ajith Kumar: ముదురుతున్న స్టార్ ఫ్యాన్స్ వార్.. ఆ హీరోను కించపరుస్తూ పోస్టర్స్..
Ajith Vijay
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 04, 2023 | 8:16 AM

చిత్రపరిశ్రమలో ఫ్యాన్స్ వార్ అనేది చాలా సహజం. తమ హీరో గొప్ప అంటే తమ హీరోనే గొప్ప అంటూ వాదించుకుంటారు. ఇక తమ అభిమాన స్టార్ సినిమా విడుదలకు ముందు అభిమానులు చేసే రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇతర హీరోలకు వ్యతిరేకంగా బ్యానర్స్ వేయడం జరుగుతుంటుంది. ఇక ఇప్పుడు ఫ్యాన్స్ వార్.. బ్యానర్ల నుంచి సోషల్ మీడియాకు వచ్చింది. ఎవరికీ వారు తమకు ఇష్టమైన తారల గురించి గొప్పగా చెప్పుకుంటారు. మరోవైపు ఇతర హీరోస్ గురించి నెగిటివ్ గా ట్రోల్స్ చేస్తుంటారు. అయితే బాలీవుడ్.. టాలీవుడ్ కంటే కోలీవుడ్ లో ఎక్కువగా ఈ ఫ్యాన్స్ వార్ జరుగుతుంటుంది. ముఖ్యంగా దళపతి విజయ్, అజిత్ అభిమానుల మధ్య తీవ్రస్థాయిలో వివాదాలు చెలరేగుతుంటాయి. గతంలోనూ వీరి ఫ్యాన్స్ మధ్య రచ్చ జరిగింది. ఇక చాలా కాలంగా సైలెంట్ గా ఉన్న ఈ ఇద్దరి అభిమానుల మధ్య ఇప్పుడు మరోసారి వార్ జరుగుతుంది. చిన్నగా మొదలై.. ఇప్పుడు మరింత ముదురుతుంది. ఇందుకు కారణం.. ఏళ్ల తర్వాత ఇద్దరి సినిమాలు ఒకేసారి రిలీజ్ కావడం.

తమిళ్ ఇండస్ట్రీలో విజయ్.. అజిత్ కుమార్‏లకు భారీగా ఫాలోయింగ్ ఉంది. ఎన్నో సూపర్ హిట్స్ అందుకుని అగ్రకథానాయకులుగా కొనసాగుతున్నారు వీరిద్దరు. ప్రస్తుతం విజయ్ దళపతి నటిస్తోన్న వరిసు సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు అజిత్ నటించిన తునివు చిత్రం కూడా జనవరి 12న థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలో తమిళనాడులో ఈ ఇద్దరి ఫ్యాన్స్ మధ్య ఉన్న కోల్డ్ వార్ ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది.

అజిత్ , విజయ్ అభిమానుల మధ్య యుద్ధం అంతకంతకు పెరుగుతుంది. హీరో అజిత్ ను కించ పరుస్తూ విజయ్ అభిమానుల పోస్టర్లు ఇప్పుడు తమిళనాట కలకలం రేపుతున్నాయి. అందుకు ప్రతిగా రిటర్న్ గిఫ్ట్ బలంగా ఉండబోతోందని అజిత్‌ అభిమానులు అదే లెవెల్లో సమాధానం ఇవ్వడం తమిళ ఇండస్ట్రీని ఓ కుదుపుకుదిపేస్తోంది. అజిత్ తినివు, విజయ్ వారిసు చిత్రాలు సంక్రాంతికి రిలీజ్‌ సిద్ధంగా ఉన్నాయి. అయితే అసలు సినిమాలు రిలీజ్‌ కాకముందే రగడ రగడ అవుతోంటే…ఇక సినిమాలు స్క్రీన్‌ మీదికొస్తే ఇక రచ్చ రంబోలా ఏ స్థాయిలో ఉంటుందోనని జనం హడలిఛస్తున్నారు. అయితే….అజిత్, విజయ్ ఫ్యాన్స్ మధ్య వార్‌ ఈనాటిది కాదు…దశబ్దాల నుంచే ఈ ఇద్దరు స్టార్‌ హీరో అభిమానుల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తూనే ఉంటుంది. అయితే ఇప్పుడు తాజాగా ఇటు టాలీవుడ్‌లో కూడా ఫ్యాన్స్‌ మధ్య యుద్ధం ఓ లెవెల్‌కి చేరింది.

అభిమానం హద్దుల్లో ఉంటునే ముద్దుగానే ఉంటుంది. అది దురభిమానంగా మారితే భారత చిత్రసీమ పరువు బజారున పడుతుంది. సరిగ్గా ఇప్పుడదే జరిగింది. అమెరికాలో బాలయ్య, పవన్‌ ఫ్యాన్స్‌ రెచ్చిపోయారు. మద్యం మత్తులో ఒకర్నొకరు చితక్కొట్టుకున్నారు. అమెరికాలోని డల్లాస్‌లో జరిగిన రచ్చ అంతా ఇంతకాదు. ఇదే యావత్‌ దేశ ప్రజల్లో దడపుట్టించింది. దేశం కాని దేశంలో పిచ్చి అభిమానాన్ని చూపిస్తే దేశం పరువుతీస్తున్నారు ఫ్యాన్స్‌. అమెరికాలో. బాలయ్య, పవన్‌ కల్యాణ్‌ ఫ్యాన్స్‌ గొడవపడి దేశం పరువు తీశారు. అది దాడులకు దారితీసింది. ఏకంగా అమెరికా పోలీసులకు చిర్రెత్తుకొచ్చేలా చేసింది. ఇక అంతటితో ఆగుతుందా? అరెస్టులూ… పోలీసులాకప్పులూ….ఎన్నారై టీడీపీ లీడర్‌ కేసీ చేకూరి అరెస్ట్‌ చేశారు…. ఎన్నారై జనసేన, పవన్‌ ఫ్యాన్స్‌తో రాజీ చర్చలు …ఫలితం ఎలా ఉన్నా పరువు మాత్రం పోయింది. ఇక ఫ్యాన్స్‌ శృతిమించిన అభిమానానికి కళ్ళేలు వేయకపోతే ఈ రచ్చ ఎటు దారితీస్తుందో అర్థంకాని పరిస్థితి హడలెత్తిస్తోంది.