Pathaan Movie: కొనసాగుతోన్న పఠాన్ మూవీ వివాదం.. షారుక్ ఫొటోలను చింపి.. కాలితో తొక్కుతూ..
అహ్మదాబాద్‌లోని వస్త్రాపూర్ ప్రాంతంలో ఆల్ఫా వన్ మాల్ భజరంగ్‌దళ్, వీహెచ్‌పీ కార్యకర్తలు వీరంగం సృష్టించారు. మాల్‌లో ఏర్పాటు చేసిన ‘పఠాన్’ చిత్రానికి..

బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్, దీపికా పదుకొనే నటించిన ‘పఠాన్’ మూవీ వివాదం కొనసాగుతోంది. అహ్మదాబాద్‌లోని వస్త్రాపూర్ ప్రాంతంలో ఆల్ఫా వన్ మాల్ భజరంగ్‌దళ్, వీహెచ్‌పీ కార్యకర్తలు వీరంగం సృష్టించారు. మాల్‌లో ఏర్పాటు చేసిన ‘పఠాన్’ చిత్రానికి సంబంధించిన పోస్టర్లు, షారుక్ ఫొటోలను చింపివేసి కాలితో తొక్కారు. సినిమాను విడుదల చేయొద్దని థియేటర్ల యజమానులను హెచ్చరించారు.
పఠాన్ సినిమా లోని కొన్ని దృశ్యాలపై హిందూ సంస్థలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. అభ్యంతరకమైన సీన్లను తొలగించాలని సినిమా యూనిట్‌ను సెన్సార్ బోర్డు ఇప్పటికే ఆదేశించింది. దీపికా పదుకొనే వేసుకున్న దుస్తులు, వీరి మధ్య పాటను చిత్రీకరించిన విధానం అభ్యంతరకరంగా ఉందంటూ హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ఈ చిత్రాన్ని బాయ్ కాట్ చేయాలంటూ దేశవ్యాప్తంగా డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించాడు. జాన్ అబ్రహం కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా జనవరిలో హిందీతో పాటు తెలుగు, కన్నడ భాషల్లో రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. అయితే, వివాదాల కారణంగా కొంత ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.



