Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandrahass: మీమ్స్‌లో చూసి చిన్నచూపు చూడొద్దు.. సానబెడితే కుర్రాడు కింగ్ అవుతాడు

ఫస్ట్ మీమ్స్‌లో చూసి కుర్రాడితో కష్టమే అనుకున్నాం. కానీ విషయం ఉంది. సరిగ్గా ఫోకస్ పెడితే ఫేట్ మారుతుంది. అది అతని చేతుల్లోనే ఉంది.

Chandrahass: మీమ్స్‌లో చూసి చిన్నచూపు చూడొద్దు.. సానబెడితే కుర్రాడు కింగ్ అవుతాడు
ETV Prabhakar Son Chandrahas
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 05, 2023 | 12:36 PM

నటుడు ప్రభాకర్.. బుల్లితెర సూపర్ స్టార్‌గా చక్రం తిప్పిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన తనయుడు హీరోగా ఫేట్ టెస్ట్ చేసుకోబోతున్నాడు. అయితే హీరోగా సెటిల్ అవ్వకముందే నెట్టింట తన ఆటిట్యూడ్‌తో వైరల్ అయ్యాడు చంద్రహాస్.  సినిమా ఓపెనింగ్ ఫంక్షన్‌లో కుర్రోడి బిహేవియర్‌ను టార్గెట్ చేసి మీమర్స్ రెచ్చిపోయారు. ఎంతలా అంటే ఒక 10 రోజుల పాటు ఎక్కడ చూసినా చంద్రహాస్ వీడియోలే. అంతటితో ఆగలే.. ఏకంగా కుర్రాడికి ఆటిట్యూడ్‌ స్టార్ అని బిరుదు ఇచ్చేశారు. నిజానికి ఆ వీడియోలు చూసి.. మేం కూడా నవ్వుకున్నాం.. కానీ తాజాగా బ్లాక్ డాగ్ అండ్ వైట్ చిక్(Black Dog For A White Chick) మూవీ నుంచి రిలీజైన సాంగ్ వీడియో చూసి మాత్రం ఓ క్లారిటీ వచ్చింది. కుర్రాడిలో ఈజ్ ఉంది. కష్టపడే తత్వం ఉంది అని అర్థమయ్యింది. డ్యాన్స్‌లు, ఫైట్‌లు కూడా ఇరగదీస్తున్నాడు. సరైన స్టోరీలు సెలక్ట్ చేసుకుని ఫోకస్ పెడితే మంచి హీరో అవుతాడు. టీనేజ్ కాబట్టి.. కాస్త తెలిసీ తెలియక అలా బిహేవ్ చేశాడేమో కానీ.. మైండ్‌లో నుంచి ఆ ఫ్లేవర్ తీసేసి కింద ఉన్న సాంగ్‌పై ఓ లుక్ వేయండి మనోడి స్టఫ్ ఏంటో మీకు అర్థమవుతుంది.

చూశారు కదా..! మంచి ఈజ్ ఉంది. బక్కచిక్కన రవితేజ, రామ్, నిఖిల్ కనిపిస్తున్నారు. ఇంకాస్త నలిగితే మెచ్యూరిటీ అదే వస్తుంది. ఇప్పుడున్న జనరేషన్‌లో మీమర్స్‌ని కంట్రోల్ చెయ్యడం కష్టం. వాటిని కూడా పాజిటివ్‌గా తీసుకుని ముందుకు సాగితే విజయాలు అందుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే.. ఈ మీమ్స్ కారణంగా అతడికి ఓ ఫేమ్ వచ్చింది. సినిమా మార్కెటింగ్‌కు కూడా అది కలిసివస్తుంది. అదే స్వతహాగా హీరోగా ప్రమోట్ చేయాలంటే మాములు విషయం కాదు. మరి చంద్రహాస్ వెండితెరపై వెలుగులు చిమ్ముతాడా..? రెగ్యులర్ సినిమాల మూసలో పడి మసకబారిపోతాడా..? లెట్స్ వెయిట్ అండ్ సీ.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.