Deepika Padukone: బర్త్ డే స్పెషల్ .. ప్రాజెక్ట్ కే నుంచి దీపికా పదుకునే లుక్..
బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న ఈ చిన్నది హాలీవుడ్ లోనూ సినిమా చేసి అలరించింది. ఇక ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతుంది.

బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ రాణిస్తోన్న ముద్దుగుమ్మల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఈ వయ్యారి భామ పేరే.. ఆ బ్యూటీనే దీపికా పదుకొనె. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న ఈ చిన్నది హాలీవుడ్ లోనూ సినిమా చేసి అలరించింది. ఇక ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు జోడీగా నటిస్తోంది దీపికా. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తోన్న ప్రాజెక్ట్ కే సినిమాలో హీరోయిన్ గా దీపికా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చాల డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిస్తున్నారు దర్శకుడు నాగ్ అశ్విన్. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ మొదలైంది. ఈ మూవీలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కూడా నటిస్తున్నారు. తాజాగా దీపికా బర్త్ డే సందర్భంగా ఆమె ప్రీరిలీక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ఫోటోను ప్రభాస్ కూడా తన సోషల్ మీడియాలో షేర్ చేసి దీపికకు బర్త్ డే విషెస్ తెలిపారు.
ఈ ఫోటో చూస్తుంటే ఈ సినిమా మరో యూనివర్స్ లో జరిగే కథలా ఉంది. దీపికా లుక్ చూస్తుంటే సినిమా ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. డార్క్ షేడ్ లో ఉన్న ఆ ఫోటో చూస్తూ ఉంటే చాలా కొత్తగా ఉంది. ఇక దీపికా లుక్ చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. హాలీవుడ్ సూపర్ హీరోస్ సినిమా మాదిరిగా ఉండబోతుంది అనిపిస్తుంది అని అంటున్నారు కొందరు.




ఇక ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే మొదటి షేడ్యూల్ ను కూడా పూర్తి చేశారు. నాగ్ అశ్విన్ ఈ సినిమాని చాలా కొత్తగా ఉండేలా చేస్తున్నారు. దీపికా లుక్కే ఇలా ఉంటే ప్రభాస్ ఎలా ఉంటాడో అని అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చూడాలి మరి ఈ మూవీ ఎలా ఉంటుందో..
Here’s wishing our @deepikapadukone a very Happy Birthday.#ProjectK #HBDDeepikaPadukone pic.twitter.com/XfCbKapf25
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) January 5, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..