OTT Movies: డబుల్ ఎంటర్‌టైన్మెంట్.. వీకెండ్‌లో ఈ ఓటీటీ రిలీజ్‌లు చూసి తీరాల్సిందే..
ప్రతీ వారం మాదిరిగానే ఈ వీకెండ్ కూడా ఓటీటీల్లో పలు చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్దంగా ఉన్నాయి.
ప్రతీ వారం మాదిరిగానే ఈ వీకెండ్ కూడా ఓటీటీల్లో పలు చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్దంగా ఉన్నాయి. మరి ఈ న్యూఇయర్ మొదటి వారంలో ఓటీటీల్లో చూడాల్సిన మూవీస్, వెబ్‌సిరీస్‌లు ఏంటో ఇప్పుడు చూసేద్దాం..
-
‘హిట్-2’:
అడివి శేష్ హీరోగా, మీనాక్షీ చౌదరీ, కోమలి ప్రసాద్ హీరోయిన్లుగా నటించిన సినిమా ‘హిట్-2’. దీనికి శైలేష్ కొలను దర్శకుడు. ‘హిట్ ది ఫస్ట్ కేస్’ సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ హిట్ అయింది. ఇక ఇప్పుడు ఓటీటీలో సందడి చేస్తోంది. జనవరి 6వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.
-
‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే – ప్రభాస్ ఎపిసోడ్’:
నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే’ సీజన్ 2లో రెబల్ స్టార్ ప్రభాస్ సందడి చేసిన సంగతి తెలిసిందే. ప్రభాస్ ఎపిసోడ్ మొదటి పార్ట్‌కు రికార్డు బ్రేక్ చేసే వ్యూస్ రాగా.. ఇప్పుడు సెకండ్ పార్ట్ స్ట్రీమింగ్‌కు సిద్దమైంది. ప్రభాస్, గోపీచంద్‌తో కలిసి బాలయ్య చేసే ఫన్ ఎలా ఉండబోతోందో తెలియాలంటే ఈ సెకండ్ ఎపిసోడ్ చూసి తీరాల్సిందే. ఇక ఇది ఆహా ఓటీటీ వేదికగా జనవరి 6 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.
-
‘ముంబై మాఫియా – పోలీస్ Vs ది అండర్‌వరల్డ్’:
90వ దశకంలో ముంబైని ఏలుతున్న అండర్‌వరల్డ్‌ను ఎన్‌కౌంటర్ కాప్స్ ఎలా ఎదుర్కున్నారన్నది ఈ క్రైమ్ వెబ్ సిరీస్ కథనం. ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ వేదికగా జనవరి 6వ తేదీ నుంచి ఇది స్ట్రీమింగ్ అవుతోంది.
-
‘ఫోన్ బూత్’:
కత్రినా కైఫ్, ఇషాన్ ఖట్టర్, సిద్ధాంట్ చతుర్వేది ప్రధాన పాత్రల్లో దర్శకుడు గుర్మీత్ సింగ్ తెరకెక్కించిన చిత్రం ‘ఫోన్ బూత్’. ఈ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.