AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sameera Sherief: ఫ్లైట్‌లో బిడ్డకు పాలిస్తూ వీడియో షేర్ చేసిన ప్రముఖ యాంకర్‌.. పిల్లాడి ఆకలి ముందు అవన్నీ తూచ్‌ అంటూ..

బహిరంగ ప్రదేశాల్లో తమ బిడ్డలకు పాలు ఇవ్వడానికి సంకోచిస్తుంటారు చాలామంది తల్లులు. అందుకు వారు ధరించిన దుస్తులతో పాటు చుట్టుపక్కల పరిసరాలు కూడా కారణమవుతాయి. అయితే పిల్లాడి ఆకలి ముందు ముందు ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు తూచ్‌ అంటూ ఫ్లైట్‌లో బిడ్డకు పాలిచ్చింది సమీరా షరీఫ్‌.

Sameera Sherief: ఫ్లైట్‌లో బిడ్డకు పాలిస్తూ వీడియో షేర్ చేసిన ప్రముఖ యాంకర్‌.. పిల్లాడి ఆకలి ముందు అవన్నీ తూచ్‌ అంటూ..
Anchor Sameera Sherief
Basha Shek
|

Updated on: Jan 06, 2023 | 9:16 AM

Share

మాతృత్వంతోనే మహిళల జీవితానికి పరిపూర్ణత వస్తుందంటారు. అందుకే పెళ్లైన ప్రతి అమ్మాయి తల్లిగా మారాలనుకుంటోంది. మాతృత్వాన్ని మనసారా ఆస్వాదించాలనుకుంటుంది. ప్రస్తుతం ఇదే మధురానుభూతితో మురిసిపోతుంది ప్రముఖ బుల్లితెర నటి, యాంకర్‌ సమీరా షెరీఫ్. సీనియర్‌ నటి సన కుమారుడు అన్వర్ తో ఆమెకు 2019లో వివాహమైంది. పెళ్లికి ముందు దాదాపు నాలుగేళ్లు ప్రేమలో ఉన్న వీరు పెద్దల అనుమతితో ఒక్కటయ్యారు. ఆ తర్వాత తమ దాంపత్య బంధానికి గుర్తింపుగా సెప్టెంబర్ 4న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ప్రస్తుతం పిల్లాడి ఆలనాపాలనా చూసుకుంటూ మాతృత్వపు అనుభూతిని మనసారా ఆస్వాదిస్తోన్న యాంకర్ సమీరాఫ్.. తన బిడ్డకు విమానంలో పాలిస్తూ సోషల్‌ మీడియాలో వీడియోను షేర్ చేసింది. ఇప్పుడీ వీడియో వైరల్‌గా మారింది. సాధారణంగా బహిరంగ ప్రదేశాల్లో తమ బిడ్డలకు పాలు ఇవ్వడానికి సంకోచిస్తుంటారు చాలామంది తల్లులు. అందుకు వారు ధరించిన దుస్తులతో పాటు చుట్టుపక్కల పరిసరాలు కూడా కారణమవుతాయి. అయితే పిల్లాడి ఆకలి ముందు ముందు ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు తూచ్‌ అంటూ ఫ్లైట్‌లో బిడ్డకు పాలిచ్చింది సమీరా షరీఫ్‌.

కంఫర్ట్‌ గా ఉంది..

‘నేను వేసుకున్న డ్రస్ చాలా సౌకర్యవంతంగా ఉంది. ఇది నా కొడుక్కి పాలు ఇవ్వడానికి ఎంతో కంఫర్ట్‌గా ఉంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాడికి ఆకలి అయినప్పుడల్లా పాలిస్తాను’ అని ఈ వీడియోలో రాసుకొచ్చింది సమీరా. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. నెటిజన్లందరూ ఆమెను ప్రశంసిస్తూ కామెంట్లు పెడుతున్నారు. ఇక సమీరా విషయానికొస్తే.. ఆడపిల్ల సీరియల్‌ తో తెలుగువారిని పలకరించింది. ఆ సీరియల్ సూపర్ హిట్ కావడంతో వరుసగా అవకాశాలు దక్కించుకుంది. అన్నా చెల్లెల్లు, భార్యామణి, డాక్టర్‌ చక్రవర్తి, ముద్దు బిడ్డ, మూడుముళ్ల బంధం, మంగమ్మ గారి మనవడు, తోడి కోడళ్లు, అరవింద సమేత తదితర సీరియల్స్‌ లో నటించి బుల్లితెర ప్రేక్షకులకు బాగా చేరువైంది. ఆ తర్వాత నిర్మాతగా మారి తమిళంలో కొన్ని ధారావాహికలను కూడా నిర్మించింది. ఇక కొన్ని రోజులు అదిరింది కామెడీ షోకు యాంకరింగ్ చేసి ఆకట్టుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..