Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manchu Lakshmi: అనుష్కతోనే నా షో స్టార్ట్ చేయాలనుకున్నాను.. కానీ ఫోన్ చేసి ఆ మాట చెప్పింది.. మంచు లక్ష్మి ఆసక్తికర కామెంట్స్..

మంచు లక్ష్మి.. కేవలం నటిగానే కాదు.. నిర్మాతగా..యాంకర్‏గానూ క్రేజ్ సంపాదించుకున్నారు. అటు వెండితెరపై అలరిస్తూనే పలు రియాల్టీ షోస్.. టాక్ షోస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తుంటారు. ప్రస్తుతం ఆమె ప్రముఖ తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహాలో "ఆహా భోజనంబూ" అనే కుకింగ్ షో చేస్తున్నారు.

Manchu Lakshmi: అనుష్కతోనే నా షో స్టార్ట్ చేయాలనుకున్నాను.. కానీ ఫోన్ చేసి ఆ మాట చెప్పింది.. మంచు లక్ష్మి ఆసక్తికర కామెంట్స్..
Manchu Lakshmi, Anushka She
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 06, 2023 | 9:29 AM

సీనియర్ హీరో మంచు మోహన్ బాబు నటవారసురాలిగా చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు మంచు లక్ష్మి. కేవలం నటిగానే కాదు.. నిర్మాతగా..యాంకర్‏గానూ క్రేజ్ సంపాదించుకున్నారు. అటు వెండితెరపై అలరిస్తూనే పలు రియాల్టీ షోస్.. టాక్ షోస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తుంటారు. ప్రస్తుతం ఆమె ప్రముఖ తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహాలో “ఆహా భోజనంబూ” అనే కుకింగ్ షో చేస్తున్నారు. ఈ షోలోకి పలువురు తారలను తీసుకువచ్చి వంటకాల తయారీ విధానం చూపిస్తూనే పలు ఆసక్తికర విషయాలను రాబడుతుంటారు. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మంచులక్ష్మీ ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. సెలబ్రెటీలతో షో చేయడం ఎలా ఉంటుంది.. వారితో తన ప్రవర్తన ఎలా ఉంటుందనేది చెబుతూ.. హీరోయిన్ అనుష్క విషయంలో జరిగిన అనుభవానాన్ని చెప్పుకొచ్చారు.

మంచు లక్ష్మి మాట్లాడుతూ.. “ఓసారి అనుష్క శెట్టిని నా షోకు రమ్మని పిలిచాము. తను కూడా వస్తా అని చెప్పింది. ఆ తర్వాత రెండు రోజులు తనకు..నాకు కాంటాక్ట్ లేదు. తను భాగమతి ప్రమోషన్లలో బిజీగా ఉంది. రాజమండ్రిలో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటుంది. దీంతో తనను కాంటాక్ట్ అవ్వడం కుదరలేదు. నాలో భయం కూడా స్టార్ట్ అయ్యింది. ఎందుకంటే ఆమెతోనే నా షో స్టార్ట్ చేయాలనుకున్నాను. ఆమెకు పూలు పంపాను. తన స్నేహితులకు ఫోన్స్ చేశాను. చాలా రకాలుగా ప్రయత్నించాను. అలాగే నాలుగు, ఐదు సార్లు ప్రయత్నించాను..

ఇవి కూడా చదవండి

ప్రమోషన్స్ నుంచి తను తిరిగి వచ్చేసరికి తన ఇల్లు నా మెసేజ్ లతో నిండిపోయింది. తను వెంటనే నాకు ఫోన్ చేసి నేను వస్తానని చెప్పానుగా అంటూ సమాధానమిచ్చింది. కానీ నేను చాలా భయపడ్డాను. వాళ్లు మా కోసం టైం చేసుకుని వస్తున్నారు కాబట్టి వారిని గౌరవంగా చూసుకోవాలి. నేను ఏయ్ రండే అంటే వచ్చే వాళ్లు ఉన్నారు. రానా, రకుల్, తాప్సీని ఏయ్ రండే అంటే ఠక్కున వచ్చేస్తారు. వాళ్లకు నా మీద అంత ప్రేమ. నార్త్ లాగా.. సౌత్ లో టీవీ షోలకు అంతగా రారు ” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం మంచు లక్ష్మీ కామెంట్స్ వైరలవుతున్నాటి.

వారికి ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం.. 12 రాశుల వారికి రాశిఫలాలు
వారికి ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం.. 12 రాశుల వారికి రాశిఫలాలు
టెన్త్ విద్యార్థులకు అలెర్ట్.. పరీక్షలపై కీలక ప్రకటన
టెన్త్ విద్యార్థులకు అలెర్ట్.. పరీక్షలపై కీలక ప్రకటన
వేసవిలో చర్మాన్ని తాజాగా ఉంచేందుకు ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
వేసవిలో చర్మాన్ని తాజాగా ఉంచేందుకు ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
రికెల్టన్, సూర్య తుఫాన్ ఇన్నింగ్స్.. ముంబై ఖాతాలో తొలి విజయం
రికెల్టన్, సూర్య తుఫాన్ ఇన్నింగ్స్.. ముంబై ఖాతాలో తొలి విజయం
తనిఖిల్లో భాగంగా వాహనాన్ని ఆపిన పోలీసులు.. లోపల చెక్ చేయగా..
తనిఖిల్లో భాగంగా వాహనాన్ని ఆపిన పోలీసులు.. లోపల చెక్ చేయగా..
మీకు ఉన్న ఈ అలవాటును వెంటనే మానుకోండి..!
మీకు ఉన్న ఈ అలవాటును వెంటనే మానుకోండి..!
ఇంటర్నేషనల్ ప్లేయర్లతో కామెడీ ఆటలు.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్
ఇంటర్నేషనల్ ప్లేయర్లతో కామెడీ ఆటలు.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్
ముంబై ఏషియన్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌‌కు కొడాలి నాని తరలింపు
ముంబై ఏషియన్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌‌కు కొడాలి నాని తరలింపు
కెప్టెన్సీని విడిచిపెట్టే ముందు పరాగ్‌కు షాకిచ్చిన బీసీసీఐ
కెప్టెన్సీని విడిచిపెట్టే ముందు పరాగ్‌కు షాకిచ్చిన బీసీసీఐ
చేసిన ఒక్క సినిమా అట్టర్ ప్లాప్.. కట్ చేస్తే..
చేసిన ఒక్క సినిమా అట్టర్ ప్లాప్.. కట్ చేస్తే..