AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Urfi Javed: అలాంటి దుస్తులు వేసుకోవడానికి కారణమదే.. షాకింగ్ ఫోటోస్ షేర్ చేసిన ఉర్ఫీ జావేద్.

అందరికంటే భిన్నంగా.. ఎప్పుడూ చిత్రవిచిత్రమైన డ్రెస్సులతో కనిపిస్తుంటుంది ఉర్ఫీ జావెద్. అయితే ఈ విషయంలో ఆమెను నిత్యం ట్రోల్ చేస్తుంటారు. అలాగే ఎన్నోసార్లు బెదిరింపులు కూడా వచ్చాయి. అంతేకాకుండా ఆమెపై పలుచోట్లు పోలీసులకు ఫిర్యాదులు కూడా వచ్చాయి. అయినా అవేం పట్టించుకోకుండా..

Urfi Javed: అలాంటి దుస్తులు వేసుకోవడానికి కారణమదే.. షాకింగ్ ఫోటోస్ షేర్ చేసిన ఉర్ఫీ జావేద్.
Urfi Javed
Rajitha Chanti
|

Updated on: Jan 08, 2023 | 8:16 AM

Share

ఊర్ఫీ జావేద్.. సోషల్ మీడియా ప్రపంచంలో తను ఓ సెన్సెషన్. ఎప్పటికప్పుడు నెట్టింట ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటుంది. అందుకు కారణం తను ధరించే దుస్తులే. అందరికంటే భిన్నంగా.. ఎప్పుడూ చిత్రవిచిత్రమైన డ్రెస్సులతో కనిపిస్తుంటుంది. సైకిల్ చైన్స్.. గాజు ముక్కలు ఇలా రకరకాలుగా డ్రెస్సింగ్ డిజైన్స్‏తో ధరిస్తుంటుంది. అయితే ఈ విషయంలో ఆమెను నిత్యం ట్రోల్ చేస్తుంటారు. అలాగే ఎన్నోసార్లు బెదిరింపులు కూడా వచ్చాయి. అంతేకాకుండా ఆమెపై పలుచోట్లు పోలీసులకు ఫిర్యాదులు కూడా వచ్చాయి. అయినా అవేం పట్టించుకోకుండా.. తన స్టైల్ తాను ఎంజాయ్ చేస్తుంటుంది ఉర్ఫీ. అయితే తాను ఎప్పుడూ అలా చిత్రంగా పొట్టి దుస్తులు ధరించడం వెనక పెద్ద కారణమే ఉందని చెప్పింది. అందుకు కొన్ని ఫోటోస్ కూడా షేర్ చేసింది.

తన ఇన్ స్టాలో కొన్ని ఫోటోస్ షేర్ చేస్తూ.. “చూడండి.. ఇదీ నా సమస్య. నేను ఉన్ని లేదా మొత్తం బట్టలు వేసుకున్నప్పుడల్లా.. ఇలా అలెర్జీ వస్తుంటుంది. ఇది పెద్ద సమస్య. నేను ఎప్పుడూ ఫుల్ గా బట్టలు వేసుకోలేదు అనేది ఇప్పుడు మీ అందరికీ తెలిసిందా. నేను ఎప్పుడూ బట్టలు వేసుకున్నప్పుడు ఇలాంటి పరిస్థితి వస్తుంటుంది. అందుకే నాకు బట్టలంటేనే అలర్జీ. కావాలంటే మీరే చూడండి. నా చేతులు.. కాళ్లపై దద్దుర్లు ఎలా వచ్చాయో. ” అంటూ చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి
Urfi

Urfi

అయితే ఇప్పటికే ఆమెపై పలు చోట్ల ఫిర్యాదులు కూడా వచ్చాయి. అయితే తనపై వస్తున్న ట్రోల్స్… ఫిర్యాదుల పట్ల ఎప్పుడూ నిర్భయంగా మాట్లాడుతుంటుంది ఉర్ఫీ. నిజానికి అలాంటి పొట్టి దుస్తులు ధరించి అందరి ముందుకు రావాలంటే చాలా ధైర్యం కావాలి. నలుగురి ఆలోచనలు.. మాటలను పట్టించుకోకుండా తనకు నచ్చినట్లు ఎంజాయ్ చేస్తుంది.

View this post on Instagram

A post shared by Uorfi (@urf7i)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.