Chiranjeevi: మేం నిరంతర శ్రామికులం.. సినిమానే మా కులం.. సినీ కార్మికుల కృషిపై మెగాస్టార్ ఎమోషనల్
సంక్రాంతి పండగను పురస్కరించుకుని అందరికీ శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్ వాల్తేరు వీరయ్య మూవీకి సంబంధించిన ఓ మేకింగ్ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. అందులో తన వాల్తేరు వీరయ్య సినిమా కోసం నిరంతరం శ్రమించిన సినీ కార్మికులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం వాల్తేరు వీరయ్య. సంక్రాంతి సందర్భంగా శుక్రవారం(జనవరి 13) విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌తో దూసుకెళ్తోంది. కే.ఎస్.రవీంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ ఓ కీలక పాత్ర పోషించాడు. శ్రుతిహాసన్ హీరోయిన్‌గా నటించింది. కాగా సంక్రాంతి పండగను పురస్కరించుకుని అందరికీ శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్ వాల్తేరు వీరయ్య మూవీకి సంబంధించిన ఓ మేకింగ్ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. అందులో తన వాల్తేరు వీరయ్య సినిమా కోసం నిరంతరం శ్రమించిన సినీ కార్మికులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అందులో సినిమా షూటింగ్ కోసం కార్మికులు పడుతున్న కష్టాలను వివరంగా చూపించారు. సినీ కార్మికులు తలచుకుంటే చేయలేనిది ఏమీ లేదని.. అసాధ్యాలను సైతం సుసాధ్యం చేయగలరని ఈ వీడియోలో చెప్పుకొచ్చారు చిరంజీవి. సినిమా చిత్రీకరణలో ఎన్నో కష్టాలను వాళ్లు ఇష్టంగా ఎదుర్కొంటారని.. ఎన్నో నెలలపాటు కుటుంబానికి, భార్యాపిల్లలకు దూరంగా ఉంటూ ప్రేక్షకులను అలరించడానికి శ్రమిస్తారని తెలిపారు. సినీ కార్మికుల అకుంటిత కృషి వాల్తేరు వీరయ్య విజయానికి ఓ కారణమని పేర్కొన్నారు.
అనంతరం ఈ మేకింగ్ వీడియోని తన ట్విటర్ ద్వారా ఫ్యాన్స్‌తో షేర్ చేసుకున్న చిరంజీవి.. ‘మేమంతా సినీ కార్మికులం. నిరంతర శ్రామికులం. కళామతల్లి సైనికులం. సినిమా ప్రేమికులం.. సినిమానే మా కులం.. మా గమ్యం.. మిమ్మల్ని అలరించడం’ అని రాసుకొచ్చాడు. చిరంజీవి వాయిస్ ఓవర్‌తో మొదలయ్యే ఈ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. కాగా డ్రగ్స్ స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన వాల్తేరు వీరయ్య సినిమాలో మరోసారి తనలోని కామెడీ యాంగిల్‌ను చూపించాడు చిరంజీవి. అలాగే యాక్షన్ అంశాలకు పెద్దపీట వేశారు. కాగా మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించిన ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చారు.
మేమంతా సినీ కార్మికులం నిరంతర శ్రామికులం కళామతల్లి సైనికులం సినిమా ప్రేమికులం సినిమానే మా కులం మా గమ్యం.. మిమ్మల్ని అలరించటం!
THANK YOU One & All?https://t.co/AdQg2v12xv pic.twitter.com/m9n2plOOAA
— Chiranjeevi Konidela (@KChiruTweets) January 14, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..