Megastar Chiranjeevi: ‘ఆరోజు ఆయనలో శివుడిని చూశాను.. చిరుకు కోపం రావడం చూసి షాకయ్యను’.. డైరెక్టర్ బాబీ కామెంట్స్..

సినిమా షూటింగ్ సెట్ లో మొదటి సారి చిరుకు కోపం రావడం చూశానని.. ఆరోజు ఆయనలో శివుడు కనిపించాడని అన్నారు. ఎప్పుడూ ప్రశాంతంగా కనిపించే చిరంజీవికి కోపం రావడం చూసి షాకయ్యనంటూ చెప్పుకొచ్చారు బాబీ.

Megastar Chiranjeevi: 'ఆరోజు ఆయనలో శివుడిని చూశాను.. చిరుకు కోపం రావడం చూసి షాకయ్యను'.. డైరెక్టర్ బాబీ కామెంట్స్..
Bobby, Megastar Chiranjeevi
Follow us

|

Updated on: Jan 15, 2023 | 3:23 PM

మెగాస్టార్ చిరంజీవి.. డైరెక్టర్ బాబీ కాంబినేషన్లో వచ్చిన వాల్తేరు వీరయ్య సూపర్ హిట్‏గా నిలిచింది. సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలైన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. అలాగై దేవీ శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ శ్రోతలను ఆకట్టుకుంటుంది. ఇందులో చిరు సరసన శ్రుతి హాసన్ నటించగా.. మాస్ మహారాజా రవితేజ కీలకపాత్రలో నటించారు.ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ రావడంతో శనివారం చిత్రయూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఇందులో పాల్గొన్న డైరెక్టర్ బాబీ.. ఓ సినిమా షూటింగ్ సెట్ లో మొదటి సారి చిరుకు కోపం రావడం చూశానని.. ఆరోజు ఆయనలో శివుడు కనిపించాడని అన్నారు. ఎప్పుడూ ప్రశాంతంగా కనిపించే చిరంజీవికి కోపం రావడం చూసి షాకయ్యనంటూ చెప్పుకొచ్చారు బాబీ.

దర్శకుడు బాబీ మాట్లాడుతూ.. వాల్తేరు వీరయ్య చూసిన ప్రేక్షకులు ‘’మా చిరంజీవిని మాకు ఇచ్చావ్ అన్నా’’ అన్నారు. ఒక అభిమాని అయిన దర్శకుడుకి ఇంతకంటే గొప్ప సక్సెస్ ఏం కావాలి. చాలా గర్వంగా అనిపించింది. చిరంజీవి గారికి కోట్లలో అభిమానులులో ఉన్నారు. వాళ్ళ రూపంలో నేను వచ్చాను. ఈ సినిమా చేసే ప్రయాణంలో ఒక దర్శకుడిగా నాకు ఎంతో ఫ్రీడం ఇచ్చారు. ఆయన ఇచ్చిన ఫ్రీడమ్ , ప్రేమ, భోరసా వలనే వాల్తేరు వీరయ్య ఇంత అందంగా వచ్చింది. చిరంజీవి గారు, రవితేజ గారి ఎమోషనల్ సీన్స్ కి క్లాప్స్ కొడుతున్నారు. ఇంత గొప్ప మ్యాజిక్ జరగడానికి వారి మధ్య వున్న ప్రేమ, వాత్సల్యం కారణం. రవితేజ గారు ఎప్పుడూ ఈ సినిమా రష్ చూస్తానని అడగలేదు. ఆయనకి వున్న నమ్మకం అది. హ్యాట్సప్ రవితేజ గారు. ఈ సినిమా చూస్తున్నపుడు ఎమోషన్ ని నమ్ము బాబీ అని బాస్ చెప్పేవారు. ఈ రోజు ఆ ఎమోషనే మా అందరికీ గౌరవం తెచ్చింది పెట్టింది. చిరంజీవి గారికి ఒక ట్రిబ్యూట్ గా ఈ సినిమాని చేశాం. చిరంజీవి గారు, రవితేజ గారు లాంటి సెల్ఫ్ మేడ్ స్టార్స్ ని డీల్ చేయడం నా అదృష్టం.

సెట్ లో చిరంజీవి పొగడ్తల్ని పట్టించుకోరు. కానీ నిర్మాతకు రూపాయి నష్టం వచ్చే పనిచేసినా లేదా సినిమాకు ఇబ్బంది వచ్చే ఏ విషయమైనా ఆయన దగ్గరికి తీసుకెళ్లకపోతే.. ఆయనకు కోపం వచ్చేస్తుంది. వేరే సినిమా షూటింగ్ లో ఆయనలోని శివుడిని చూశాను. షాట్ కి పిలవకుండా మేనేజర్ ఇబ్బంది పడుతుంటే.. ఫస్ట్ టైమ్ చిరంజీవికి కోపం రావడాన్ని చూసి నేను షాక్ అయిపోయాను. ఛైర్ విసిరేసి.. మీ బోడి.. ఈ ఫెర్ఫార్మెన్స్ నా దగ్గరొద్దు. నేను తినే ఇడ్లీ కన్నా.. అక్కడ షాట్ ఇంపార్టెంట్ అని ఛైర్ విసిరేసి వెళ్లిపోతున్న చిరంజీవిని దూరం నుంచి చూశాను. దీంతో వాల్తేరు వీరయ్య సెట్ లో అలా ఇబ్బంది తేకూడాదని ప్రయత్నించాను” అంటూ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.