AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Getup Srinu: హీరోగా మారిన గెటప్ శ్రీను.. తొలి సినిమాలోనే హీరోయిన్‏తో లిప్‏లాక్.. ‘రాజు యాదవ్’ టీజర్ అదిరిపోయిందిగా..

ఇన్నాళ్లు కమెడియన్‏గా కనిపించిన శ్రీను.. ఇప్పుడు హీరోగా మారారు. ఆయన ప్రధాన పాత్రలో సాయి వరుణవి క్రియేషన్స్ బ్యా నర్ పై రూపొందిన చిత్రం "రాజుయాదవ్ ". సూడో హీరోయిజం జోనర్ లో రూపుదిద్దుకొంటున్న ఈ చిత్రాన్ని ప్రశాంత్ రెడ్డి నిర్మిస్తున్నారు.

Getup Srinu: హీరోగా మారిన గెటప్ శ్రీను.. తొలి సినిమాలోనే హీరోయిన్‏తో లిప్‏లాక్.. 'రాజు యాదవ్' టీజర్ అదిరిపోయిందిగా..
Raju Yadav
Rajitha Chanti
|

Updated on: Jan 15, 2023 | 4:07 PM

Share

జబర్ధస్త్ కామెడీ షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న వారిలో గెటప్ శ్రీను ఒకరు. కేవలం కామెడీలోనే కాదు.. ఆయన వేసే ప్రతి గెటప్‏లోనూ ఒదిగిపోయి ప్రేక్షకులను అలరిస్తారు. బుల్లితెరపైనే కాకుండా వెండితెరపై కూడా పలు చిత్రాల్లో కనిపించారు గెటప్ శ్రీను. జాంబీరెడ్డి సహా పలు చిత్రాల్లో నటించి మెప్పించారు. ఇన్నాళ్లు కమెడియన్‏గా కనిపించిన శ్రీను.. ఇప్పుడు హీరోగా మారారు. ఆయన ప్రధాన పాత్రలో సాయి వరుణవి క్రియేషన్స్ బ్యా నర్ పై రూపొందిన చిత్రం “రాజుయాదవ్ “. సూడో హీరోయిజం జోనర్ లో రూపుదిద్దుకొంటున్న ఈ చిత్రాన్ని ప్రశాంత్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో కృష్ణమాచారి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో వున్న రాజు యాదవ్ టీజర్ ని సంక్రాంతి కానుకగా ఈ రోజు విడుదల చేశారు మేకర్స్.

హాస్యబ్రహ్మ బ్రహ్మానందం వాయిస్ ఓవర్‎తో మొదలైన ఈ టీజర్‏లో లవ్ కామెడీ తో పాటు మంచి ఎమోషన్స్ తో ఆసక్తికరంగా వుంది. బుల్లితెర కమల్ హాసన్ గా పేరు తెచ్చుకున్న గెటప్ శ్రీను తనలో వున్న కంప్లీట్ యాక్టర్ ని ఆవిష్కరించేలా ఈ సినిమా ఉండబోతుందని టీజర్ చూస్తే అర్ధమౌతోంది. టీజర్ లో గెటప్ శ్రీను నటన అవుట్ స్టాండింగ్ గా ఉంది. ఏం జరిగినా.. లైఫ్ లాంగ్ స్మైల్ ఫేస్ తో గడపాల్సి వస్తే ఎలా వుంటుంది అనే పాయింట్ చాలా ఆసక్తికరంగా ఎక్సయిటింగా వుంది. హీరోయిన్ అకింత ఖరత్ స్క్రీన్ ప్రజన్స్ ఆకట్టుకుంది. సాయి రామ్ ఉదయ్ విజువల్స్ బ్రిలియంట్ గా ఉన్నాయి. టీజర్ కి హర్ష వర్ధన్ రామేశ్వర్ అందించిన నేపధ్య సంగీతం ఎక్స్ ట్రార్డినరీ గా వుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా వున్నాయి. టీజర్ ‘రాజు యాదవ్’ పై క్యూరీయాసిటీని పెంచింది.

ఇటివలే గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ సాధించడంలో భాగమైన ప్రముఖ గేయరచయిత చంద్రబోస్ ఈ చిత్రంలో రెండూ పాటలు రాయడం, అలాగే రాహుల్ సింప్లీగంజ్ ఓ పాట పాడటం మరో ప్రధాన ఆకర్షణ. మరో రెండు పాటలకు కాసర్ల శ్యాం సాహిత్యం అందిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని మార్చిలో ఈ సినిమాని విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.అయితే ఈ టీజర్ లో గెటప్ శ్రీను లిప్ లాక్ సీన్ కు సంబంధించిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. అయితే లిప్ లాక్ సీన్ ఏమో గానీ.. నటుడిగా గెటప్ శ్రీనులోని మరో కొత్త కోణాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.