Tollywood: ఈ ఫోటోలో ఇద్దరు స్టార్ హీరోస్ ఉన్నారు.. బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరికీ ప్రాణాలు ఇచ్చే అభిమానులున్నారు..

పైన ఫోటోను చూశారు కదా. అందులో ఇద్దరు టాప్ హీరోస్ ఉన్నారు. ఎవరో గుర్తుపట్టండి. వారిద్దరికీ ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఇండస్ట్రీలో అగ్ర కథనాయకులుగా రాణిస్తున్నారు.

Tollywood: ఈ ఫోటోలో ఇద్దరు స్టార్ హీరోస్ ఉన్నారు.. బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరికీ ప్రాణాలు ఇచ్చే అభిమానులున్నారు..
Actors
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 18, 2023 | 9:10 AM

సోషల్ మీడియాలో గంటలు గంటలు మునిగి తేలుతున్నారు చాలా మంది. ప్రపంచంలో ఏం జరుగుతుందనేది క్షణాల్లో నెట్టింట్లో తెలుసుకుంటున్నారు. అయితే ఇంటర్నెట్ వాడకంలో మన తారలు కూడా ముందుంటున్నారు. లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేయడమే కాకుండా.. తమ చిన్ననాటి పిక్స్ కూడా పంచుకుంటున్నారు. ఇటీవల కొద్దిరోజులుగా సెలబ్రెటీలకు చెందిన బాల్యం తాలూకూ ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. ఇటీవల చరణ్, తారక్, ప్రభాస్, అల్లు అర్జున్ వంటి స్టార్స్ పిక్స్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. తాజాగా ఇద్దరూ స్టార్ హీరోలకు సంబంధించిన ఫోటో ఒకటి చక్కర్లు కొడుతుంది. పైన ఫోటోను చూశారు కదా. అందులో ఇద్దరు టాప్ హీరోస్ ఉన్నారు. ఎవరో గుర్తుపట్టండి. వారిద్దరికీ ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఇండస్ట్రీలో అగ్ర కథనాయకులుగా రాణిస్తున్నారు. కానీ కాలేజీ లైఫ్ లో నుంచే వీరిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అని తెలుస్తోంది. ఇంతకీ వారు ఎవరో కనిపెట్టారా ?. అయితే గుర్తుపట్టండి.

ఆ ఫోటోలో ఉన్నది ఎవరంటే. తమిళ్ స్టార్ హీరోస్ సూర్య.. విశాల్. అయితే పైన కనిపిస్తోన్న పిక్ ఎప్పటిదనేది క్లారిటీ లేదు. ఏదో ఫంక్షన్ లో మిత్రులతో కలిసి ఉన్నట్లుగా తెలుస్తోంది. ముందు వరుసలో విశాల్ ఉండగా.. అతని పక్కనే భుజం పై చేసి వేయి సూర్య కూర్చుని ఉన్నారు. వీరంత ఫోటోలకు ఫోజులిస్తూ సరదాగా గడుపుతున్నట్లుగా కనిపిస్తోంది. ప్రస్తుతం సూర్య, విశాల్ ఇద్దరికీ తమిళంతోపాటు.. తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. వీరి సినిమాలు తెలుగులోనూ డబ్ అయ్యి సూపర్ హిట్స్ గా నిలిచాయి. సూర్య చివరిసారిగా కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమాలో అతిథి పాత్రలో కనిపించారు. సూర్య తమిళ సినీ నటుడు శివకుమార్ తనయుడు. అతని సోదరుడు కార్తీ కూడా ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తన సహనటి జ్యోతికను 2006లో ప్రేమ వివాహం చేసుకున్నారు సూర్య. వీరికి దియా, దేవ్ అని ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ఇవి కూడా చదవండి

ఇక విశాల్ విషయానికి వస్తే.. తమిళ్ డైరెక్టర్ అర్జున్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా సినీ రంగంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత చెల్లమే సినిమాతో హీరోగా వెండితెరపై కనిపించారు. పందెం కోడి, తిమిరి చిత్రాలు విశాల్ కెరీర్లో భారీ విజయాన్ని సాధించిన చిత్రాలుగా నిలిచాయి. ఇటీవలే లాఠీ సినిమాతో థియేటర్లలో సందడి చేశారు విశాల్. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది.

42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..