Prabhas: డార్లింగ్ ఫ్యాన్స్‏కు డబుల్ ధమాకా.. ఈ ఏడాదిలోనే ప్రభాస్.. మారుతి సినిమా రిలీజ్ ?..

ప్రభాస్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ఓ చిన్న బడ్జెట్ సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. పీపుల్స్ ఫ్యాక్టరీ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ప్రకటించలేదు. కానీ షూటింగ్ మాత్రం శరవేగంగా జరుగుతోంది

Prabhas: డార్లింగ్ ఫ్యాన్స్‏కు డబుల్ ధమాకా.. ఈ ఏడాదిలోనే ప్రభాస్.. మారుతి సినిమా రిలీజ్ ?..
Prabhas, Maruthi
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 18, 2023 | 9:36 AM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు చేస్తోన్న సినిమాలన్ని భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాలు కావడం విశేషం. బాహుబలి సినిమాతో ఒక్కసారిగా దేశం దృష్టి తనపై తిప్పుకున్న ఈ హీరో సినిమాల కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. ఇప్పటికే వచ్చిన రాధేశ్యామ్ చిత్రం నిరాశపరచడం.. మరోవైపు గతేడాది విడుదలైన ఆదిపురుష్ టీజర్ కూడా అంతగా ఆకట్టుకోకపోవడంతో తదుపరి చిత్రాలపైనే ఆశలు పెట్టుకున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. ఈ క్రమంలోనే కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ రూపొందిస్తోన్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సలార్ మూవీపైనే ఇప్పుడు అంచనాలున్నాయి. ఇవే కాకుండా.. డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ఓ చిన్న బడ్జెట్ సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. పీపుల్స్ ఫ్యాక్టరీ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ప్రకటించలేదు. కానీ షూటింగ్ మాత్రం శరవేగంగా జరుగుతోంది. ఇటీవల సెట్ నుంచి లీకైన ప్రభాస్ ఫోటో సినిమాపై క్యూరియాసిటిని పెంచేసింది.

ఇదిలా ఉంటే.. తాజాగా ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది. టాలీవుడ్ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మేరకు ఈ సినిమా ఇప్పటికే రెండు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకుందట. అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే 2023 దసరా కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ థార్డ్ షెడ్యూల్స్ షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. దీంతో జూన్ లో ఆదిపురుష్ రావడం…ఆ వెంటనే దసరాకు మారుతి..ప్రభాస్ సినిమా వస్తుండడం డార్లింగ్ అభిమానులకు డబుల్ ధమాకానే అని చెప్పుకొవాలి.

అలాగే లేటేస్ట్ గా వినిపిస్తోన్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా మూడో షెడ్యూల్ ఓ యాక్షన్స్ సీక్వెన్స్ కూడా చేస్తున్నారట. ఇందులోనే మాళవిక మోహనన్ కూడా పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే ఇందులో నిధి అగర్వాల్ కూడా కనిపించనుంది. హారర్ కామెడీ జోనర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?