Manchu Manoj: ఎట్టకేలకు శుభవార్త చెప్పిన మంచు మనోజ్.. ఫోటో షేర్ చేస్తూ క్లారిటీ ఇచ్చిన హీరో..

సినిమాలు చేసి చాలా కాలం అవుతుందని.. ఇప్పటికీ అదే ప్రేమ చూపిస్తున్నారని.. ఆ ప్రేమకు ఎంతో కొంత తిరిగి ఇవ్వాల్సిన సమయం వచ్చేసిందంటూ మనోజ్ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది.

Manchu Manoj: ఎట్టకేలకు శుభవార్త చెప్పిన మంచు మనోజ్.. ఫోటో షేర్ చేస్తూ క్లారిటీ ఇచ్చిన హీరో..
Manchu Manoj
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 20, 2023 | 2:23 PM

గత కొద్ది రోజులుగా మంచు మనోజ్ సోషల్ మీడియాలో యాక్టివ్‏గా ఉంటున్న సంగతి తెలిసిందే. జనవరి 20న ఓ విషయం పంచుకుంటానని.. ఆ వార్త చాలా రోజులుగా తన మనసులోనే దాచుకున్నానంటూ ఫాలోవర్లను ఆసక్తికి గురిచేశాడు మనోజ్. దీంతో తమ హీరో పెళ్లి గురించి క్లారిటీ ఇవ్వబోతున్నాడని అంతా అనుకున్నారు. అయితే అందరు అనుకున్నట్లు పెళ్లి గురించి కాదు.. తన కొత్త సినిమా గురించి అంటూ అసలు విషయం చెప్పేశాడు మనోజ్. సినిమాలు చేసి చాలా కాలం అవుతుందని.. ఇప్పటికీ అదే ప్రేమ చూపిస్తున్నారని.. ఆ ప్రేమకు ఎంతో కొంత తిరిగి ఇవ్వాల్సిన సమయం వచ్చేసిందంటూ మనోజ్ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది.

“నేను సినిమాలు చేసి చాలా సంవత్సరాలు అవుతుంది. అయినప్పటికీ నాపై మీరు ప్రేమ కురిపిస్తూనే ఉన్నారు. మీరు చూపిస్తున్న ప్రేమకు ఎంతో కొంత తిరిగి ఇవ్వాల్సిన సమయం వచ్చేసింది. వాట్ ద ఫిష్ అనే కొత్త సినిమాతో మీ ముందుకు రాబోతున్నాను. ఈ మూవీ మీ అందరికీ కచ్చితంగా క్రేజీ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది . ” అంటూ ట్వీట్ చేశాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. తన కొత్త సినిమా పోస్టర్ సైతం రిలీజ్ చేశారు. దీంతో మనోజ్ సెకండ్ పెళ్లి గురించి కాదని.. తిరిగి రీఎంట్రీ ఇస్తున్నట్లు క్లారిటీ ఇచ్చేశాడు. మొత్తానికి రీఎంట్రీ ఇస్తున్నావు అది చాలు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఆరు సంవత్సరాల విరామంలో ఉన్న మంచు మనోజ్ ఈరోజు అధికారికంగా ప్రకటించిన కొత్త ప్రాజెక్ట్‌ తో గతంలో కంటే ఎక్కువ ఎనర్జీతో తిరిగి వస్తున్నారు. ‘వాట్ ది ఫిష్’ అనే ఆసక్తికరమైన టైటిల్ తో  తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వరుణ్ దర్శకత్వంతో పాటు కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు.

అనౌన్స్ మెంట్ పోస్టర్ ప్రపంచ స్థాయి వైబ్ ‌లను కలిగిస్తుంది. పోస్టర్ చిత్రానికి సంబధించిన ముఖ్య అంశాల అంతర్గత వివరాలను వెల్లడిస్తుంది. ఈ ఆసక్తికరమైన పోస్టర్‌ లో చాలా మంది తెలియని వ్యక్తులను ఎదుర్కోవటానికి మనోజ్ సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. గోగల్ మాస్క్‌ తో ఉన్న అమ్మాయి క్యారియేచర్ చిత్రాన్ని కూడా చూపిస్తుంది. బ్యాక్ పోజ్‌లో మనోజ్ ఫిట్‌ గా కనిపిస్తున్నాడు. మనోజ్ మేక్ ఓవర్ అయ్యారు. అతని కొత్త గెటప్‌ను చూడటానికి మరికొంత సమయం వేచి చూడాలి.

ట్వీట్..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?