AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: సింప్లీటికీ చిరునామా.. నిజజీవితంలోనూ భిన్నత్వమే.. స్కూల్ టీచర్‌గా మారిన టాలెంటెడ్ నటి

నటనలో ఆమెది నిత్యనూతనత్వం. ఎప్పుడూ కొత్తగా కనిపించాలనుకుంటుంది. ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకోవాలని చూస్తుంది. సినిమా ఇండస్ట్రీ అంటే ఎంత గ్లామర్‌ ఫీల్డ్‌ అయినా.. పక్కింటి అమ్మాయిగానే ఉండేందుకు ఇష్టపడుతుంది. ఆమే నిత్యామీనన్‌. అలనాటి సావిత్రిలా సహజత్వం ఆమె సొంతం. అందరినీ నా వాళ్లుగా భావించే నిత్యామీనన్‌.. పెద్దవాళ్లతోనే కాదు పిల్లలతోనూ ఇట్టే కలిసిపోతుంది.

Viral: సింప్లీటికీ చిరునామా.. నిజజీవితంలోనూ భిన్నత్వమే.. స్కూల్ టీచర్‌గా మారిన టాలెంటెడ్ నటి
Nithya Menon
Ram Naramaneni
|

Updated on: Jan 20, 2023 | 2:20 PM

Share

నిత్యమీనన్‌.. పరిచయం అక్కర్లేని నటి. సింప్లిసిటీకి చిరునామా.. నటనలోనే కాదు.. నిజజీవితంలోనూ భిన్నత్వమే. నలుగురికి నచ్చనిది ఆమెకు నచ్చుతుంది… ఎంత ఎదిగినా ఒదిగే ఉండాలనుకుంటుంది.. అందుకే ఆమె నిత్యనూతనం. నటనలోనే కాదు.. జీవితంలో కూడా నిరాడంబరతనే కోరుకుంటారు. తాజాగా తన సింప్లిసిటీతో మరోమారు ఆకట్టుకున్నారు నిత్యామీనన్‌. ఇటీవల తెలుగు రాష్ట్రంలోని కృష్ణాపురం గ్రామంలో  ఓ సినిమా షూటింగ్‌లో పాల్గొన్న నిత్యామీనన్‌.. పక్కనే ఉన్న గవర్నమెంట్‌ స్కూలుకు వెళ్లారు. అక్కడ పిల్లలతో సరదాగా గడపడమే కాదు.. వారికి పాఠాలు చెప్పారు. ఆ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయడంతో.. నిత్యమీనన్‌ సామాజిక స్పృహ కలిగిన వ్యక్తిగా ప్రేక్షకులు కీర్తిస్తున్నారు. తాను ఎంత ఎదిగినా గతాన్ని మరువని సగటు జీవిగానే ఉండాలనుకునే నిత్యామీనన్‌కు.. సహజంగానే ఆ జీన్స్‌ ఉన్నాయి. సోషల్‌ యాక్టివిటీస్‌లోనూ పాల్గొంటారు. అందుకే నిత్యామీనన్‌ సాధారణ ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు.

అందరిలా రెస్ట్‌లెస్‌ వర్క్‌ చేయడానికి నిత్యామీనన్‌ ఇష్టపడరు. పనిచేయాలి.. చేశాక కావాల్సిన రెస్ట్‌ తీసుకోవాలన్నది ఆమె సిద్దాంతం. ఆ సమయంలో ఎక్కువగా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఇష్టపడే నిత్యామీనన్‌.. ఇలా అప్పుడప్పుడూ తన సహజత్వాన్ని చాటుకుంటూ ప్రేక్షకులకు మరింత దగ్గరవుతున్నారు. బీమ్లానాయక్‌ సినిమాలో తన మనసుకు నచ్చిన గిరిజనుల కోసం పోరాడే మహిళగా నటించి మెప్పించారు. పల్లెటూరు జీవితాలు తెలిసిన వ్యక్తిగా.. అందరికితోనూ ఇట్టే కలిసిపోతారు. బాల్యం విలువ తెలిసిన వ్యక్తిగా పిల్లలకు హక్కున చేర్చుకోవడమే కాదు.. ఒక్కోసారి పసిపిల్లలను లాలిస్తూ ఉన్న సందర్భాలనూ మనం చూశాం. నిత్యామీనన్‌ టీచింగ్‌కు పిల్లలే కాదు.. నెజినన్లు కూడా ఫిదా అయ్యారు. పాజిటివ్‌ కామెంట్లు పెడుతూ.. నిత్యమీనన్‌ మీరు సూపర్‌ అంటూ పొగిడేస్తున్నారు.

View this post on Instagram

A post shared by Nithya Menen (@nithyamenen)

ఇటీవల గిరిజన బిడ్డలను ఎత్తుకోవడం, కాలికి కట్టు కట్టుకోవడం, ప్రెగ్నెన్సీ కిట్‌తో పాటు బేబీబంప్‌ ఫోటోలు షేర్‌ చేయడం.. ఇలా ఏది చేసినా తన సింప్లిసిటీకి అవి నిదర్శనం అని చెప్పుకునే యత్నం చేశారు. అందులో కొన్ని సినిమా ప్రమోషన్ల కోసం చేసినా.. మరికొన్ని తన మనసుకు నచ్చినదాని కోసం చేశారు. నిత్యమీనన్‌ సింప్లిసిటీకి అందరూ ఆశ్చర్యపోతారని ఇండస్ట్రీ వర్గాలే చెబుతుంటాయి. చేతిలో చాలా సినిమాలే ఉన్నప్పటికీ.. మధ్యలో కాస్త రిలాక్స్‌ను కోరుకుంటారు నిత్యామీనన్‌. మలయాళీ ముద్దుగుమ్మే అయినా.. సినిమా పరంగా స్థానిక భాషను నేర్చుకుని నటించడం, ఇలా పాఠాలు చెప్పేస్థాయికి ఎదగడాన్ని చూస్తే ఆమెలో ఉన్న కష్టపడేతత్వానికి అద్దం పడుతుంది. పేరుకు మలయాళీ నటే అయినా.. అన్నివర్గాల ప్రేక్షకులకు దగ్గరయ్యారు నిత్యామీనన్‌. అవకాశాలు ఎన్ని వస్తున్నా అందులో తాను న్యాయం చేయగలిగే పాత్ర ఉంటేనే సెలెక్ట్‌ చేసుకుంటారు. అలా అయితేనే.. ప్రేక్షకుల్లో చిరస్థాయిగా నిలిచిపోగలమని భావిస్తుంటారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..