AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sirivennela: సీఎం జగన్‌ను కలిసిన సిరివెన్నెల కుటుంబ సభ్యులు.. ఆపద సమయంలో ఆదుకున్నారంటూ సత్కారం

సిరివెన్నెల సీతారామశాస్త్రి సతీమణి, కుటుంబ సభ్యులు ఏపీ ముఖ్యమంత్రిని స్వయంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా దివంగత శ్రీ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డితో సిరివెన్నెల అనుబంధాన్ని ముఖ్యమంత్రితో పంచుకున్నారు. అనంతరం ఆయనను సత్కరించి జ్ఞాపికను అందజేశారు.

Sirivennela: సీఎం జగన్‌ను కలిసిన సిరివెన్నెల కుటుంబ సభ్యులు.. ఆపద సమయంలో ఆదుకున్నారంటూ సత్కారం
Sirivennela Family, Cm Jagan
Basha Shek
|

Updated on: Jan 26, 2023 | 11:37 AM

Share

ప్రముఖ సినీ గేయ రచయిత దివంగత సిరివెన్నెల సీతారామశాస్త్రి కుటుంబ సభ్యులు ఏపీ సీఎం జగన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వారు సిరివెన్నెల అనారోగ్య సమయంలో ప్రభుత్వం ఆదుకున్నందుకు సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. కాగా సిరివెన్నెల ఆరోగ్య సమయంలో ఆయన చికిత్స ఖర్చులను ప్రభుత్వమే భరించేలా జగన్‌ నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఆ కుటుంబానికి విశాఖపట్నంలో ఇంటి స్థలం కూడా మంజూరు చేశారు. ఈనేపథ్యంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి సతీమణి, కుటుంబ సభ్యులు ఏపీ ముఖ్యమంత్రిని స్వయంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా దివంగత శ్రీ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డితో సిరివెన్నెల అనుబంధాన్ని ముఖ్యమంత్రితో పంచుకున్నారు. అనంతరం ఆయనను సత్కరించి జ్ఞాపికను అందజేశారు. కాగా సిరివెన్నెల కుటుంబానికి అవసరమైన సాయం చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరపున పూర్తి సహకారం ఇవ్వనున్నట్లు ఆయన కుటుంబానికి సీఎం భరోసానిచ్చారు. సీఎం జగన్‌ను కలిసిన వారిలో సిరివెన్నెల సతీమణి పద్మావతి, కుమారులు యోగేశ్వర శర్మ, రాజా, కుమార్తె శ్రీలలితా దేవి, సిరివెన్నెల సోదరుడు సీఎస్‌.శాస్త్రి తదితరులు ఉన్నారు.

ఈక్రమంలో సీఎం జగన్ ని కలిసిన సిరివెన్నెల కుటుంబసభ్యుల ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్ కి చెందిన దిగ్గజ సినీ గేయ రచయిత పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి 2021, నవంబర్ 30న అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. వేలాది సినిమాల్లో ఎన్నో గొప్ప గొప్ప పాటలను రచించిన సిరివెన్నెల మన మధ్య లేకపోయినా ఆయన కలం నుంచి జాలువారిన పాటలు మాత్రం నిత్యం వినిపిస్తూనే ఉన్నాయి. ఇక సిరివెన్నెల కుమారుడు రాజా చెంబోలు నటుడిగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఫిదా, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా, అంతరిక్షం, హ్యాపీ వెడ్డింగ్‌, రణరంగం, మిషన్‌ మజ్ఞు తదితర సినిమాల్లో కీలక పాత్రలు పోషించాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..