SS Rajamouli: కాస్త గ్యాప్ ఇవ్వమ్మా .. కీరవాణికి పద్మశ్రీ అవార్డుపై రాజమౌళి ఆసక్తికర ట్వీట్.. 

తాజాగా ఎస్ఎస్ రాజమౌళి ఇన్ స్టా వేదికగా తన ఆనందాన్ని తెలియజేశారు. తన అన్నయ్య విషయంలో తాను గర్వంగా ఉన్నట్లు చెప్పారు. కీరవాణిని చూస్తూ కూర్చున్న ఓ ఫోటోను షేర్ చేస్తూ... ఎమోషనల్ నోట్ రాశారు.

SS Rajamouli: కాస్త గ్యాప్ ఇవ్వమ్మా .. కీరవాణికి పద్మశ్రీ అవార్డుపై రాజమౌళి ఆసక్తికర ట్వీట్.. 
Rajamouli, Keeravani
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 26, 2023 | 11:20 AM

టాలీవుడ్ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణికి ప్రతిష్టాత్మక అవార్డ్ పద్మ శ్రీ వరించిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం బుధవారం సాయంత్రం పద్మ అవార్డ్స్ ప్రకటించింది. దీంతో ఆయనకు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా ఎస్ఎస్ రాజమౌళి ఇన్ స్టా వేదికగా తన ఆనందాన్ని తెలియజేశారు. తన అన్నయ్య విషయంలో తాను గర్వంగా ఉన్నట్లు చెప్పారు. కీరవాణిని చూస్తూ కూర్చున్న ఓ ఫోటోను షేర్ చేస్తూ… ఎమోషనల్ నోట్ రాశారు. అన్నయ్యకు వరుస అవార్డులు రావడం పట్ల సంతోషంగా ఉందని.. అవార్డుకు.. అవార్డుకు కాస్త గ్యాప్ ఇవ్వమని ఈ విశ్వానికి చెబుతానని.. ప్రతి విజయాన్ని పూర్తిగా ఆస్వాదించగలనని అన్నారు. కీరవాణికి ఈ అవార్డ్ ఎప్పుడో రావాల్సి ఉందని.. కానీ ఆలస్యమైందని అన్నారు జక్కన్న.

“నిజానికి ఈ గుర్తింపు ఎప్పుడో వచ్చి ఉండాలని అభిమానులందరు ఆశిస్తున్నట్లుగానే నేను ఎదురుచూశాను . పద్మశ్రీ అవార్డు గుర్తింపు కోసం చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్నాను. ఈ ప్రపంచం గట్టిగా అనుకుంటే ప్రతి వ్యక్తి కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ఏదో ఒకరూపంలో అందిస్తుందని మీరు ఎప్పుడూ చెప్పే మాటలను గుర్తుపెట్టుకున్నాను. ఒకవేళ ఈ ప్రపంచం నాతో మాట్లాడితే ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. కొంచెం గ్యాప్ ఇవ్వమ్మా ఒకటి పూర్తిగా ఎంజాయ్ చేశాక మరోటి ఇవ్వు అని చెబుతాను. నా పెద్దన్న .. ఎంఎం కీరవాణికి పద్మ శ్రీ అవార్డ్ రావడం ఎంతో ఆనందంగా ఉంది. గర్వంగా ఫీలవుతున్నాను” అంటూ రాజమౌళి ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి

ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఈ ఏడాది వరుస అవార్డులు అందుకుంటున్నారు ఎంఎం కీరవాణి. ఇప్పటికే ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్నారు. అలాగే…బోస్టన్ సోసైటి ఆఫ్ ఫిల్మ్ క్రిటిక్స్, క్రిటిక్స్ ఛాయిస్ మూవీ అవార్డ్ లాస్ ఏంజెల్స్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డులను ఆయన సొంతం చేసుకున్నారు. ఇక తాజాగా కేంద్రం అందించే ప్రతిష్టాత్మక అవార్డు పద్మ శ్రీ వరించింది. అలాగే మరోవైపు ఆస్కార్ అవార్డులలో ఒరిజినల్ పాట కేటగిరిలోనూ నాటు నాటు సాంగ్ నామినేట్ అయిన సంగతి తెలిసిందే.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.