చీరలో చూడ చక్కగా.. త్రిష క్యూట్ పిక్స్

Samatha

18 August 2026

సీనియర్ నటి స్టార్ బ్యూటీ త్రిష గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ అమ్మడు అందానికి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే.

ఇప్పటికీ వరసగా సినిమాలు చేస్తూ అందంలో నటనలో కుర్ర హీరోయిన్స్‌కు గట్టి పోటీ ఇస్తుంది ఈ అందాల ముద్దుగుమ్మ.

ఇక తమిళనాడు ఎన్నికల సమయం నుంచి ఈ బ్యూటీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన అనేక వార్తలు నెట్టింట హల్ చల్ అవుతున్నాయి.

అయితే విజయ్ సీఎంగా ప్రమాణస్వీకారం కార్యక్రమంలో మెరిసిన ఈ బ్యూటీ రీసెంట్‌గా ఇండిపెడెన్స్ డే వేడుకల్లో కూడా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.

తమిళనాడు ప్రభుత్వం మెరీనా బీచ్ వేదికగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరపగా, త్రిష హాజరై, ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది.

పసుపు రంగు చీరలో చాలా అందంగా ముస్తాబై తన గ్లామర్‌తో ప్రతి ఒక్కరి మనసు దోచుకుంది ఈ అందాల  బ్యూటీ.

ఈ చిన్నది ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ తన క్యూట్ ఫొటోస్ అందరితో షేర్ చేసుకుంటూ ఉంటుంది.

ఈ క్రమంలోనే పసుపు రంగు చీరలో ఉన్న ఫొటోలను అభిమానులతో పంచుకోవడంతో, ఇవి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉన్నాయి.