AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అరెరె ఇన్నాళ్లు లైట్ తీసుకున్నామా.. అల్లం టీ తాగితే కడుపులో ఇంత జరుగుతుందా.. తెలిస్తే అస్సలు వదలరు..

కడుపులో అసౌకర్యంగా ఉన్నప్పుడు అల్లం టీని తాగడం మన ఇళ్లలో తరతరాలుగా వస్తున్న సహజసిద్ధమైన అలవాటు. అయితే ఇది కేవలం కడుపు నొప్పికి మాత్రమే కాకుండా జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో, బరువు నియంత్రణలో కూడా సహాయపడుతుందని ఆధునిక అధ్యయనాలు సూచిస్తున్నాయి. రోజువారీ అలవాట్లలో అల్లం టీని చేర్చుకోవాలనుకునే వారికి సైన్స్ ఏం చెప్తుందో తెలుసుకుందాం..

Krishna S
|

Updated on: Aug 18, 2026 | 6:59 AM

Share
జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది: మనం తీసుకున్న ఆహారం కడుపులో నుంచి త్వరగా చిన్న పేగుల్లోకి సాగేలా చేయడంలో అల్లం అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది. సాధారణంగా తిన్న ఆహారం గంటల తరబడి జీర్ణాశయంలోనే నిలిచిపోవడం వల్ల కడుపు ఉబ్బరం, వికారం, గుండెల్లో మంట వంటి సమస్యలు వస్తాయి. వరల్డ్ జర్నల్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ అధ్యయనం ప్రకారం.. అల్లం జీర్ణాశయ కండరాల కదలికలను వేగవంతం చేసి ఆహారాన్ని త్వరగా ముందుకు నెట్టేస్తుంది. ప్రముఖ ఆయుర్వేద నిపుణుల సైతం అల్లాన్ని జీర్ణకోశ సమస్యలను నివారించే ఉత్తమ సహజ టానిక్‌గా అభివర్ణిస్తున్నారు.

1 / 5
భోజనం ముగిసిన వెంటనే కడుపు బండరాయిలా భారంగా అనిపించే సమస్యతో బాధపడేవారికి అల్లం గొప్ప పరిష్కారం. 2011లో ఫంక్షనల్ డిస్పెప్సియా ఉన్న 126 మందిపై జరిగిన ఒక అధ్యయనంలో.. అల్లం, ఆర్టిచోక్ సారం కలిపిన సప్లిమెంట్లు కడుపు ఉబ్బరం, వికారం, కడుపు నొప్పి వంటి సమస్యలను తగ్గించినట్లు గుర్తించారు. అయితే ఈ అధ్యయనం సప్లిమెంట్ ఆధారంగా జరిగిందని, ఇంట్లో తయారుచేసే సాధారణ టీతోనూ కచ్చితంగా అదే స్థాయి ఫలితం ఉంటుందని భావించలేమని పరిశోధకులు గుర్తుచేస్తున్నారు.

2 / 5
ఇక బరువు నియంత్రణ విషయానికి వస్తే.. అల్లం టీ ఒక్కటే నేరుగా కొవ్వును కరిగించలేకపోయినా.. శరీర కొలతల్లో మార్పులు తెచ్చేందుకు సహాయపడుతుంది. 2025లో కాంప్లిమెంటరీ థెరపీస్ ఇన్ మెడిసిన్‌లో ప్రచురితమైన సమీక్ష ప్రకారం.. అల్లం తీసుకోవడం వల్ల నడుము చుట్టుకొలత, శరీరంలో పేరుకుపోయిన అనవసర కొవ్వు శాతం తగ్గుతాయి. అయితే ఇది స్థూలకాయాన్ని పూర్తిగా తగ్గించే మ్యాజిక్ డ్రింక్ కాదని, ఆరోగ్యకరమైన జీవనశైలితో పాటు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.

3 / 5
అల్లం టీ తాగే సమయంపై ఎలాంటి కఠిన నిబంధనలు లేవు. భోజనం చేసిన తర్వాత లేదా కడుపు బరువుగా అనిపించినప్పుడు దీనిని తీసుకోవడం ఉత్తమం. అయితే రాత్రి వేళల్లో టీ పొడి, కెఫిన్ కలపకుండా.. కేవలం తాజా అల్లం ముక్కలను వేడి నీటిలో మరిగించి తాగడం వల్ల నిద్రకు ఆటంకం కలగదు. అతిగా చక్కెర, తేనె కలపకుండా తేలికపాటి కషాయంలా తీసుకుంటేనే పూర్తి ప్రయోజనాలు లభిస్తాయి.

4 / 5
తయారీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు: అల్లం టీ ద్వారా పూర్తి ఆరోగ్య ప్రయోజనాలు పొందాలంటే తాజా అల్లం ముక్కలను నీటిలో బాగా మరిగించి తయారుచేయాలి. ఇందులో ఎక్కువ మొత్తంలో చక్కెర లేదా తేనె జోడించకుండా తేలికపాటి ఇన్ఫ్యూషన్‌లా తీసుకోవడం మంచిది. సరైన మోతాదులో తీసుకుంటూ మీ జీవనశైలిలో భాగంగా చేసుకుంటే అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను సహజంగానే అధిగమించవచ్చు.

5 / 5
Follow Us