AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భలే భలే బోడకాకర.. ఇవి తింటే ఎన్నో రోగాలు హుష్‌కాకి..

వర్షాకాలంలో మాత్రమే ప్రకృతి సహజసిద్ధంగా లభించే బోడకాకరకాయ లేదా అడవి కాకరకాయకు గ్రామీణ ప్రాంతాల్లో మంచి డిమాండ్‌ ఉంటుంది. విటమిన్లు, ఫైబర్, మెగ్నీషియం, ఫోలిక్ యాసిడ్, జింక్ వంటి పలు పోషకాలు ఇందులో ఉంటాయి. మధుమేహం, రక్తపోటు నియంత్రణకు ఇది ఉపయోగపడుతుందని ప్రజల్లో నమ్మకం ఉన్నప్పటికీ, దీనిని ఏ వ్యాధికైనా మందుగా భావించకూడదు. సీజనల్‌ కూరగాయగా పరిమితంగా ఆహారంలో చేర్చుకోవచ్చు.

భలే భలే బోడకాకర.. ఇవి తింటే ఎన్నో రోగాలు హుష్‌కాకి..
Boda Kakarakaya Health Benefits
Shaik Madar Saheb
|

Updated on: Aug 19, 2026 | 11:41 AM

Share

చేలల్లో, డొంకల్లో దట్టమైన అడవుల్లో, పచ్చని చెట్ల మధ్య ప్రకృతి సహజ సిద్ధంగా లభించే ఒక ప్రత్యేకమైన కాకరకాయను బోడకాకరకాయ లేదా అడవి కాకరకాయ అని పిలుస్తారు. దీనిని ఇష్టపడని వారు అరుదు. ఆరోగ్య ప్రదాయినిగా పేరుగాంచిన ఈ కాకరలో అనేక ఔషధ గుణాలు నిక్షిప్తమై ఉన్నాయి. వర్షాకాలంలో మాత్రమే లభించే ఈ కాకరను రుచి చూస్తే వ్యాధులు దరిచేరవని ప్రజల్లో ప్రగాఢ నమ్మకం ఉంది. ఇది కేవలం అటవీ ప్రాంతాల్లోనే, దట్టమైన పొదల్లోని చెట్ల తీగలకు అల్లుకుని పెరుగుతుంది. ముఖ్యంగా వర్షాలు కురిసినప్పుడు, డొంకల్లో, చేలల్లో.. అటవీ ప్రాంతాల్లో అడవి కాకర కాయలు విరివిగా కాస్తాయి. ఈ కాకరలో దాగి ఉన్న అద్భుతమైన ఔషధ గుణాల కారణంగా వంటకాల్లో వీటి వాడకం పెరుగుతోంది. అటవీ ప్రాంతాలలో పాటు దట్టమైన పొదల్లో మాత్రమే ఈ చెట్ల తీగలు అల్లుకుంటాయి. సాధారణంగా జులై నెల నుంచి శ్రావణ మాసం చివరి వరకు ఇవి లభ్యమవుతాయి. అయితే, అడవి కాకరగా పిలుచుకునే ఈ కాకరకాయల చెట్లను ఎక్కడ పెంపకం చేపట్టినా అవి మొలకెత్తవని, కేవలం ప్రకృతి సహజ సిద్ధంగా మాత్రమే ఈ చెట్లు, తీగలు పుట్టుకొచ్చి పూతకు వస్తాయని రైతులు పేర్కొంటారు.

బోడకాకరకాయ ఆరోగ్యానికి చాలా మంచిదని స్థానికులు చెబుతారు. ముఖ్యంగా షుగర్ (మధుమేహం), రక్తపోటు (బీపీ) నియంత్రణకు ఇది ఎంతగానో సహాయపడుతుందని ప్రజల్లో నమ్మకం ఉంది. అందుకే దీని ధర ఎంత ఉన్నా, మొదటి పంట చాలా మంచిదని భావించి కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. వర్షాలతో అటవీ ప్రాంతాల్లో అడవి కాకర్లు ఎక్కువగా లభ్యమవుతుండగా, గ్రామీణ ప్రాంతాల్లోని యువకులు, చిన్నారులు, పశువుల కాపరులు వీటిని అడవుల్లోని చెట్ల తీగల నుంచి సేకరించి స్థానికంగా అమ్మకాలు సాగిస్తారు.

బోలెడు పోషకాలు..

ఆరోగ్య ప్రదాయినిగా పిలవబడుతూ, ఔషధ గుణాలు కలిగి ఉండటంతో ప్రజలు సైతం వీటి కొనుగోలుకు మక్కువ చూపుతారు. ఈ కాకరలో విటమిన్ బి1, బి2, బి3 లు అధికంగా ఉంటాయని స్థానికులు చెబుతారు. వీటితో పాటు, మెగ్నీషియం, ఫోలిక్ యాసిడ్, జింక్, ఫాస్పరస్, మాంగనీస్, పీచు పదార్థాలు కూడా ఇందులో పుష్కలంగా ఉంటాయి. ఈ పోషక సమ్మేళనం రక్తపోటు సమస్యలను అదుపు చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. అందుకే ఈ అడవి కాకరను “ఆరోగ్య కాకర”గా పిలుచుకుంటామని ప్రజలు పేర్కొంటున్నారు.

శ్రావణమాసం చివరి వరకు

ఎలాంటి రసాయన మందులు వాడకుండా, ప్రకృతి సహజ సిద్ధంగా లభిస్తుండడంతో ప్రజలు ఈ కాకరను బోడ కాకర లేదా అడవి కాకర అని పిలుస్తారు. ప్రతి సంవత్సరం ఆషాఢమాసం మొదలై శ్రావణమాసం చివరి వరకు ఈ కాకర విరివిగా లభిస్తుండడంతో, ప్రతి ఒక్కరూ దీనిని ఏడాదిలో ఒక్కసారైనా రుచి చూస్తామని పేర్కొంటుంటారు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లోనూ కిలో 200 నుంచి 300 రూపాయలకు విక్రయాలు జరుగుతున్నట్లు వ్యాపారులు తెలిపారు. ఇది కేవలం ఒక కూరగాయ మాత్రమే కాకుండా, ప్రకృతి అందించిన ఒక అద్భుతమైన ఔషధ సంపదగా బోడకాకరకాయ ప్రసిద్ధి చెందింది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
సెప్టెంబర్ 7 రాశిఫలాలు: వీరికి ఈ రోజు పట్టిందల్లా బంగారమే..
సెప్టెంబర్ 7 రాశిఫలాలు: వీరికి ఈ రోజు పట్టిందల్లా బంగారమే..
బంగారం, వెండి కొనేవారికి శుభవార్త.. మళ్లీ తగ్గుతున్న ధరలు
బంగారం, వెండి కొనేవారికి శుభవార్త.. మళ్లీ తగ్గుతున్న ధరలు
దారుణ హత్య.. మహిళ గొంతులో కత్తెరలు దింపి మర్డర్‌! ఎక్కడంటే..
దారుణ హత్య.. మహిళ గొంతులో కత్తెరలు దింపి మర్డర్‌! ఎక్కడంటే..
మహిళ కడుపులో 14 పెన్నులు, 5 చెంచాలు.. డాక్టర్లు ఏం చేశారంటే?
మహిళ కడుపులో 14 పెన్నులు, 5 చెంచాలు.. డాక్టర్లు ఏం చేశారంటే?
ఇక వీరి అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు.. కష్టాలకు ఫుల్ స్టాప్
ఇక వీరి అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు.. కష్టాలకు ఫుల్ స్టాప్
బిగ్ బాస్ 10 లాస్ట్ కంటెస్టెంట్ గా 'గుప్పెడంత మనసు' సీరియల్ నటుడు
బిగ్ బాస్ 10 లాస్ట్ కంటెస్టెంట్ గా 'గుప్పెడంత మనసు' సీరియల్ నటుడు
మీకు 50 ఏళ్లు వచ్చేసరికి కనీసం కోటి రూపాయలు ఉండాలంటే ఏం చేయాలి?
మీకు 50 ఏళ్లు వచ్చేసరికి కనీసం కోటి రూపాయలు ఉండాలంటే ఏం చేయాలి?
బిగ్‌బాస్‌ 10లోకి యాంకర్ వర్షిణీ.. శ్రీముఖిలా సత్తా చాటుతుందా?
బిగ్‌బాస్‌ 10లోకి యాంకర్ వర్షిణీ.. శ్రీముఖిలా సత్తా చాటుతుందా?
ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవాలి? అవసరమైన దానికంటే ఎక్కువ ఉంచుకుంటే..
ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవాలి? అవసరమైన దానికంటే ఎక్కువ ఉంచుకుంటే..
ఆ ఒక్క యాక్సిడెంట్ అంతా మార్చేసింది..
ఆ ఒక్క యాక్సిడెంట్ అంతా మార్చేసింది..