అందాల ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ బ్యూటీ సొంతం.
ఈ అమ్మడు తన అందచందాలతో అందరి మనసు దోచేసుకుంటుంది. ఒకప్పుడు స్టార్‌గా వరస సినిమాలతో తన హవా కొనసాగించింది.
ఏమాయ చేసావే సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయం అయిన ఈ చిన్నది. మొదటి మూవీతోనే తన అంద చందాలతో అందరి మనసు దోచేసుకుంది.
తర్వాత ఏకంగా వరసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు కొట్టేసి, స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది.
అంతే కాకుండా ఈ ముద్దుగుమ్మ ఏ సినిమా చేసినా, అది బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో, టాలీవుడ్ లక్కీ హీరోయిన్‌గా మారిపోయింది.
ఇక కెరీర్ పీక్ స్టే్జ్‌లో ఉండగానే ఈ ముద్దుగుమ్మ అక్కినేని నాగచైతన్యను ప్రేమ వివాహం చేసుకుంది. కొన్ని రోజుల పాటు చాలా ఆనందంగా కలిసి ఉన్నా, తర్వాత వీరు పరస్పర అంగీకరంతో విడాకులు తీసుకొని విడిపోయారు.
ఇక తర్వాత ఈ బ్యూటీ మయోసైటీస్ బారిన పడటం, ఇలా చాలా విషయాల్లో కుంగిపోయిన చిన్నది రీసెంట్‌గా నిర్మాత రాజ్ నిడిమోర్‌ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.
ఇక చాలా గ్యాప్ తర్వాత మళ్లీ మా ఇంటి బంగారం మూవీతో తెలుగు అభిమానుల ముందుకు వచ్చింది. అంతే కాకుండా తాను తల్లి కాబోతున్నాను అనే గుడ్ న్యూస్ కూడా తెలిపింది.