Irumudi Censor Review: ఈ సారి గట్టిగా కొడుతున్నాడు.. రవితేజ ఇరుముడి సినిమా సెన్సార్ రివ్యూ
మాస్ మహారాజా రవితేజ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఇరుముడి’ ఆగస్టు 21న థియేటర్లలో విడుదల కానుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ డిఫరెంట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఆసక్తికరమైన గ్లింప్స్, మెలోడీతో పాటు ఎనర్జిటిక్ సాంగ్స్‌తో సినిమా మంచి బజ్ క్రియేట్ చేసింది.

మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఇరుముడి. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కోసం రవితేజ ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. అలాగే ఈ సినిమాతో రవితేజ హిట్ కొట్టడం ఖాయంగా కనిపిస్తుంది. మొదటి నుంచి ఈ సినిమా పై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి. సినిమాలో యాక్షన్, సెంటిమెంట్ తో పాటు అయ్యప్ప స్వామి మల నేపథ్యం ఉండటంతో ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు ఈ సినిమా చూద్దామా అని ఎదురుచూస్తున్నారు. ఆగస్టు 21న సినిమా థియేటర్స్ లోకి రానుంది.తాజాగా ఈ మూవీ సెన్సార్ రివ్యూ వచ్చింది. ఆగస్టు 21న థియేటర్లలోకి రాబోతున్న ‘ఇరుముడి’ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని U/A సర్టిఫికెట్ సొంతం చేసుకుంది. ఈ మూవీ రన్‌టైమ్ 2 గంటల 25 నిమిషాలుగా ఉండటం సినిమాకు ప్లస్ కానుంది.
ఇది కూడా చదవండి :
ఆ హీరోతో ఒక పాటలోనైనా కలిసి డ్యాన్స్ చేయాలి.. అదే నా కోరిక : ఇంద్రజ
ఇక ఇందులో రవితేజ మద్యం అలవాటు ఉన్న ఒక సాధారణ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మ్యాన్‌గా కనిపించనున్నారు. అయితే ఆయన అయ్యప్ప మాల వేసుకున్నాక క్యారెక్టర్‌లో వచ్చే మార్పు సినిమాకు హైలైట్‌గా నిలవనుంది. రవితేజ, ఆయన కూతురి పాత్రలో నటించిన బేబీ నక్షత్ర మధ్య ఉండే అనుబంధం ఈ కథకు ప్రధాన బలం. గ్రామంలోని మహిళలను సొంత బిడ్డల్లా చూసుకునే ఆయన పాత్ర చుట్టూ ఒక క్రైమ్ సస్పెన్స్ కథ నడుస్తుంది.
ఇది కూడా చదవండి :
చిరంజీవికి విలన్‌గా చేయడమే నాజీవితంలో అతి పెద్ద కోరిక.. నటుడి ఎమోషనల్ కామెంట్స్
శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటించగా సాయి కుమార్, అజయ్ ఘోష్, స్వాసిక కీలక పాత్రలు పోషించారు. పల్లెటూరి వాతావరణంలో ఈ చిత్రాన్ని చాలా సహజంగా తెరకెక్కించారు. జీవీ ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం సినిమాకు మరో పెద్ద ఆకర్షణ. ముఖ్యంగా అయ్యప్ప స్వామికి సంబంధించిన ఇరుముడి కట్టు, మల్లెపూల పల్లకి పాటలతో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ థ్రిల్లర్ కథను మరో స్థాయికి తీసుకెళ్లనుంది. ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్, సస్పెన్స్ అన్నీ పక్కాగా కుదరడంతో ఈ సినిమా ద్వారా రవితేజ బ్లాక్ బస్టర్ అందుకుని స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వడం ఖాయమని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
ఇది కూడా చదవండి :
ఇన్నాళ్ల తర్వాత కనిపించింది మావ..! బిందాస్ బ్యూటీ ఎంత మారిపోయింది .!!
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




